AP WEATHER : బలపడనున్న అల్పపీడనం… AP లో మూడు రోజులుగా వర్షాలు


బలపడనున్న అల్పపీడనం… ఏపీలో మూడు రోజులుగా వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది

వాయువ్య దిశగా పయనిస్తోంది

ఈ నెల 11 నుంచి 13 వరకు వర్ష సూచన

రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి

నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, రానున్న 24 గంటల్లో అది బలపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ నెల 12 ఉదయం వరకు ఇది వాయువ్య దిశగా తమిళనాడు-పుదుచ్చేరి వైపు పయనించి, ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుంది అని IMDA వివరించింది.

దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో ఈ నెల 11 నుంచి 13 వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు

Flash...   Transfers Confusion in Teachers