నా భర్త ప్రోత్సహం వల్లే నగ్నంగా నటించాను : శరణ్య

నా భర్త ప్రోత్సహం వల్లే నగ్నంగా నటించాను : శరణ్య

“ఫిదా” సినిమాలో హీరోయిన్ సాయి పల్లవికి చెల్లిగా నటించిన శరణ్య తాజాగా “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” సినిమాలో హీరోయిన్ గా మారింది.
అంతేకాదు ఇందులో ఆమె నగ్నంగా నటించింది. ఈ సినిమాలో ఆమె నటనను అందరూ మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో నగ్నంగా నటించడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. దీనిపై ఆమె స్పందించారు. తాను న్యూడ్ గా నటించడానికి ప్రధాన కారణం భర్త ప్రోత్సాహమే అని చెప్పింది. ఆయన ప్రోత్సాహం వల్లే అలా నటించానన్నారు.

కథకు సంబంధించిన సన్నివేశం కావడంతో అలా నటించాల్సి వచ్చిందన్నారు. అయితే న్యూడ్ గా నటించడం పెద్ద కష్టమేమీ కాదని, తన భర్త, దర్శకుడి ప్రోత్సాహంతో సీన్ బాగా వచ్చిందని చెప్పింది. నగ్నంగా నటించడం కంటే విమర్శలే తనను బాధించాయని అన్నారు.

ఈ సినిమాలో న్యూడ్‌గా నటించినందుకు నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. నా భర్త ప్రోత్సాహం, దర్శకుడి సహకారంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సన్నివేశాన్ని పూర్తి చేశాను. అయితే ఈ సీన్‌పై వస్తున్న విమర్శలు బాధించాయి. చాలా వెబ్‌సైట్‌లు దాని గురించి చెడు వార్తలు రాస్తుంటాయి కాబట్టి, ఏదో ఆశతో నేను నగ్నంగా నటించాను అని అనుకోవడం బాధాకరం. అలాంటి వారు తమ తీరు మార్చుకోవాలని శరణ్య వ్యాఖ్యానించారు.

Flash...   Acharya review: రివ్యూ: ఆచార్య