AP education Department crucial Decisions


-ఇంజనీరింగ్‌ మిడ్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ప్రయత్నించాలి- తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన బోధన రుసుములను తిరిగి ఇచ్చేయాలి- వీసీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ మంత్రి ఆదేశాలు

mdm





జేఎన్‌టీయూ (అనంతపురం, కాకినాడ) సంయుక్త ఆధ్వర్యంలో మే నెల నుంచి ఆన్‌లైన్‌ గేట్‌ కోచింగ్‌ తరగతులు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో స్పష్టత లేదని, జాప్యం జరిగితే దసరా, సంక్రాంతి, క్రిస్మస్‌ సెలవులు తగ్గించాలని సూచించారు. అవసరమైతే తరగతులను రోజుకో గంట అదనంగా నిర్వహించాలన్నారు. కళాశాలల అనుబంధ గుర్తింపును ఆన్‌లైన్‌ చేయాలని, పాఠ్యాంశాలు పూర్తికాని వర్సిటీలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. క్వారంటైన్‌ కేంద్రాలకు ఇచ్చిన వసతిగృహాలను వైద్య, ఆరోగ్య శాఖ నుంచి అనుమతి పత్రం తీసుకున్న తర్వాతనే విద్యార్థులకు కేటాయించాలన్నారు. విద్యార్థులకు బోధన రుసుములను పూర్తిగా ప్రభుత్వమే చెల్లించినందున తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన మొత్తాలను తిరిగి ఇప్పించాలని ఆదేశించారు. ఇంజినీరింగ్‌ మిడ్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ప్రయత్నించాలన్నారు.
Flash...   Low-intensity earthquake strikes Delhi