CARONA CASES IN AP ARE 502 AS ON 15.4.2020

ఏపీలో కరోనా పాజిటవ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బుధవారం మరో 19 కేసులు నమోదయ్యాయి. వీటిలో పశ్చిమగోదావరి జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 6, గుంటూరు జిల్లా 4, కృష్ణా జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు తాజా బులిటెన్‌‌లో తెలియజేశారు. ఈ 19 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 502కు పెరిగింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 16మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 11మంది చనిపోయారు.
CARONA-UPDATE-AP
రాష్ట్రంలో కేసుల్లో గుంటూరు జిల్లా 118 పాజిటివ్ కేసులతో టాప్‌లో ఉంది. మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో నమోదుకాగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పటి వరకు ఏడుగురు చనిపోయారు. నమోదైన కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు.
Flash...   White Fungus Symptoms: సరికొత్త టెన్షన్ వైట్ ఫంగస్, Black Fungus కన్నా ప్రమాదకరం.