ఇండియా పేరును మార్చేయాలి.. సుప్రీంకోర్టులో పిటిషన్

భారత దేశానికి ఉన్న మరో పేరు ‘ఇండియా’ను మార్చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో
పిటిషన్ దాఖలైంది. ఇండియా పేరును భారత్ అని లేదా హిందుస్థాన్ అని మార్చాలని
పిటిషనర్ తాను దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ
సుప్రీంకోర్టులో జూన్ 2న రానుంది. దేశం పేరు మార్చడం వల్ల ప్రజల్లో ఆత్మ గౌరవం,
జాతీయ భావం పెరుగుతుందని పిటిషనర్ తన పిటిషన్‌లో వివరించారు. దేశం పేరు మార్చేందుకు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో సవరణలు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని
సుప్రీం కోర్టును కోరారు.

సుప్రీం కోర్టులో అందుబాటులో ఉన్న నోటీసు ప్రకారం ఈ పిటిషన్ జూన్ 2వ తేదీన
ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు
చేశారు.
Flash...   Coronavirus Glenmark’s antiviral drug Fabiflu