రైతు భరోసా , ఎన్ని విడతల్లో ఎంతెంత పడుతుందో తెలుసా.. పూర్తి వివరాలు ఇవే

రైతు భరోసా కింద ఎంత డబ్బు అన్నదాతలకు అందుతుంది?


వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రధాని కిసాన్ పథకం నగదు రూ. 6 వేలుతో కలిపి విడతల
వారీగా రూ.13,500 రైతులకు అందిస్తోంది. తొలుత మేనిఫెస్టోలో రైతులకు రూ. 12,000
పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం
సైతం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఏడాదికి రూ. 6 వేల పెట్టుబడి సాయం
ప్రకటించింది. ఇది కూడా కలిసి రావడంతో వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రతి రైతు
కుటుంబానికి రూ. 13,500 ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు.

style="border: none; margin: 0px 0px 0px 40px; padding: 0px; text-align: left;" >

First installment:
Rs. 7,500 (Includes PM Kisan Rs 2,000)
Second installment:
Rs. 4,000 (Includes PM Kisan Rs 2,000)
Third installment:
2,000 per annum in January (PM gives Kisan)
రైతు భరోసాకు అర్హతలు ఏంటి?

ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించి విధివిధానాలు
మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రతి రైతు కుటుంబానికి ఈ పథకాన్ని
వర్తింపజేసింది. 
అలాగే
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు
వర్తిస్తుంది.
* ఉద్యాన పంటలు, పట్టు పరిశ్రమకూ రైతు భరోసా పథకం వర్తింపు
* ఉద్యాన పంటలు కనీసం ఎకరం భూమి సాగులో ఉండాలి
* కూరగాయలు, పువ్వులు, పశువుల మేత కోసం కనీసం అర ఎకరం భూమి సాగు చేస్తుండాలి
* ఒకే యజమానికి ఒకరికి మించి కౌలుదారులుంటే ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుంది
* ఒకరికి మించి కౌలుదారులుంటే ఎస్టీలకు ప్రాధాన్యం
* ఆ తర్వాతి వరుస క్రమంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలు
* వ్యవస్థీకృత భూ యజమానులకు పథకం వర్తించదు
* ప్రస్తుత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలకు ఈ పథకం వర్తించదు
Flash...   ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు క‌రోనా
* జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులకు వర్తిందు
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయాన్ని బట్టి పథకం
వర్తింపు.
రైతు భరోసా డబ్బు జమ చేశారో లేదో ఎలా చెక్ చేసుకోవాలి?
రైతులు తమ అకౌంట్లలో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకునే అవకాశాన్ని జగన్
సర్కార్ కల్పించింది. వైఎస్సార్ రైతు భరోసా వెబ్‌సైట్‌
https://ysrrythubharosa.ap.gov.in/RBApp/index.html  లోకి వెళ్ళి.. ఆ తర్వాత అక్కడ కనిపించే నో యువర్ రైతుభరోసా స్టేటస్
(Know your RythuBharosa Status) మీద క్లిక్ చేయాలి. అక్కడ సంబంధిత
రైతు ఆధార్ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేస్తే డబ్బులు అకౌంట్‌లో జమయ్యాయో
లేదో తెలుసుకోవచ్చు.