జూన్ నెలలో ఇండియా లో కరోనా విలయ తాండవం చేయనుంది.

దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత మూడు రోజులుగా 6 వేలకు పైగా
కేసులు నమోదవుతున్నాయి. జూన్, జులై నెలల్లో కరోనా వ్యాప్తి తారా స్థాయికి చేరవచ్చని
నిపుణులు అంచనా వేస్తున్నారు. కారణాలివే..


గత నాలుగు రోజులుగా రోజూ 6 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో
శుక్రవారం (మే 22) రికార్డు స్థాయిలో 6000లకు పైగా కేసులు నమోదు కాగా.. శనివారం
6654, ఆదివారం 6767 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆదివారం నాటికి భారత్‌లో
కరోనా పాజిటివ్ కేసులు 1,31,868కు చేరుకున్నాయి. దీంతో అత్యధికంగా కరోనా కేసులు
నమోదైన దేశాల జాబితాలో భారత్‌ టాప్‌టెన్‌లోకి వెళ్లింది.

కరోనాతో ఆదివారం ఒక్క రోజే 154 మంది మరణించారు.మరణాల సంఖ్య 4021కి చేరింది.

12 రోజుల్లో దేశంలో కరోనా కేసుల సంఖ్య దాదాపుగా రెట్టింపయ్యింది. రెండు నెలలుగా
కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను అంచెలంచెలుగా ఎత్తివేస్తూ కేంద్ర
ప్రభుత్వం పలు కార్యకలాపాల నిర్వహణకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో
ప్రయాణాలు, ఇతర కార్యకలాపాలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఈ కారణం వల్లే కొద్ది
రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయని చాలా మంది భావిస్తున్నారు. మరికొన్ని
రోజులు గడిస్తే ప్రభావం తగ్గుతుందని అనుకుంటున్నారు. అయితే.. ఇది నిజం కాదట.
రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సిందేనని నిపుణులు
హెచ్చరిస్తున్నారు.

గత వారం రోజులుగా పెరుగుతున్న కేసుల సంఖ్యకు సడలింపులను కారణంగా చెప్పలేమని.. ఆ ప్రభావం రానున్న రోజుల్లో తెలుస్తుందని మహాపాత్ర పేర్కొన్నారు. దేశంలో రెండు నెలల లాక్‌డౌన్‌ తర్వాత కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉందని.. ప్రజలు స్వీయ నియంత్రణ చర్యలు పాటించకపోతే వైరస్ మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఏప్రిల్, మే కంటే జూన్‌లో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చన్నారు. జులైలో తారా స్థాయికి చేరుకొనే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ అనుభవాలు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయని వివరించారు.

Flash...   AP కి త్వరలో 9 లక్షల కోవిడ్ టీకాలు

లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. మార్చి నెలలో ఇరాన్‌లో కేసుల సంఖ్య భారీగా పెరగడంతో.. వైరస్ కట్టడికి అక్కడి ప్రభుత్వం అనేక నిబంధనలను విధించింది. తర్వాత ఏప్రిల్‌లో కేసులు కాస్త తగ్గడం, కోలుకునే వారి సంఖ్య పెరగడంతో సడలింపుల వైపు మొగ్గు చూపింది. సడలింపుల అనంతరం ఇప్పుడు అక్కడ రెండో సారి వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

కరోనా మహమ్మారి ప్రభావంతో విలవిల్లాడిన స్పెయిన్‌, బ్రిటన్‌ దేశాలు స్వల్పంగా నిబంధనలు సడలించాయి. దీంతో అక్కడ మరోసారి కేసుల సంఖ్య పెరుగుతోంది. దక్షిణ కొరియాలోనూ ఇదే పరిస్థితి. అక్కడ బార్లు, క్లబ్బులకు అనుమతి ఇచ్చారు. కొన్ని క్లబ్బుల కారణంగా అక్కడ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాను కట్టడి చేశామని చెప్పిన చైనాలోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్‌కు కేంద్ర స్థానమైన వుహాన్‌లోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి.