AP CARONA: ఆదివారం ఒక్కరోజే 100కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.


ఏపీలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసిరింది. ఆదివారం ఒక్కరోజే 100కు పైగా కరోనా కేసులు
నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 3 వేలు దాటాయి.

ఏపీలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. శనివారం పాజిటివ్ కేసుల సంఖ్య కంటే భారీగా
పెరిగాయి. ఆదివారం ఒక్కరోజే 100కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా బులిటెన్
ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 98 మందికి కరోనా పాజిటివ్‌గా
తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.. ఇతర కేసులు కూడా 12
ఉన్నాయి. దీంతో ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 110 కరోనా కేసులు నమోదయ్యాయి.
కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు.
తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 3,042కు చేరాయి. మరో 43 మంది వైరస్ నుంచి
కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య
845కు చేరింది. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 650పైగా పాజిటివ్ కేసులు
నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 400కు పైగా కేసులు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,135 మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల
నుంచి డిశ్చార్జ్ చేశారు.
Flash...   మున్ముందు మరింత ప్రమాదకరంగా మారుతున్న కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్