Corona boom in India: 1.45 lakh cases

భార లో కోవిడ్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత రెండు వారాల్లోనే కొత్తగా 70 వేల కేసులు నమోదయ్యాయి. రోజకు 6 వేలకుపైగా కరోనా కేసులు

ఇండియా లో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 6535 కొత్త కేసులు నమోదు కాగా.. 146 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్‌లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 1.45 లక్షలు దాటింది. ఇప్పటి వరకూ మనదేశంలో 4167 మంది కోవిడ్ వల్ల మరణించారు. దేశంలో ప్రస్తుతం 80 వేేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన దేశంలో కోవిడ్ రికవరీ రేటు 42.6 శాతానికి చేరింది.

ప్రపంచంలో అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ టాప్-10లోకి చేరిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 55.86 లక్షల మంది ఇన్ఫెక్షన్ బారిన పడగా.. 3.47 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

మన దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కొత్తగా 2436 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 52,667కు చేరింది. గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 1186 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 60 మంది చనిపోయారు. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 1695 మంది కోవిడ్‌కు బలి కాగా.. 15,786 మంది డిశ్చార్జ్ అయ్యారు.

పాజిటివ్ కేసుల్లో ఇరా ను దాటేసి.. ప్రపంచంలో 10 స్థానానికి

మహారాష్ట్రలో రోజు రోజుకూ కొత్త రికార్డులు బద్ధలవుతున్నాయి. ఆదివారం ఏకంగా 3,041 కొత్త కేసులు నమోదుకాగా.. ముంబయిలో అత్యధికంగా 1,725 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 50వేల మార్క్ దాటింది. ఒక్క ముంబయిలోనే 30వేల కేసులు నమోదుకావడం గమనార్హం. బెంగాల్‌లోనూ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అక్కడ గడచిన 24 గంటల్లో 208 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,667కి ఎగబాకింది. మే 10 తర్వాత ఒక్క రోజు ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.


Flash...   ఉప్పు నీళ్లతో కరోనా ఖతమే.. స్వల్ప లక్షణాలు కనిపిస్తే ఇలా చేయండి.. సైంటిస్టులు ఇదే చెబుతున్నారు!