Whats App New Features Introduced


వాట్సాప్‌లో గ్రూపులు, కాంటాక్ట్స్‌ ఎక్కువైపోయేసరికి పాత ఇమేజ్‌, పీడీఎఫ్‌, లింక్‌ కావాలంటే వెతకడం చాలా కష్టం. అందుకే వాట్సాప్‌ ఓ ఫీచర్‌ను తీసుకురాబోతోంది. మీకు వాట్సాప్‌లో వచ్చిన ఫొటోలు, డాక్యుమెంట్‌లు, గిఫ్‌లు, ఆడియో మెసేజ్‌లను ఒక చోట ఫైల్‌ మేనేజర్‌లో చూపించబోతోంది. వాటిలో మీకు కావాల్సిన దానిని సెర్చ్‌ ద్వారా కూడా వెతుక్కోవచ్చు. సులభంగా ఉండటానికి ఇందులో ఒక్కోరకం ఫైల్‌కు ఒక్కో రంగు ఇచ్చారు.

వాట్సాప్‌లో వీడియో కాల్స్‌ చేసుకోవడం కొత్తేమీ కాదు. గ్రూప్‌ కాలింగ్‌ కూడా అంతే. అయితే గ్రూప్‌ కాలింగ్‌లో గరిష్ఠంగా నలుగురికి మాత్రమే కాల్‌ చేయగలం. త్వరలో ఈ నెంబరు పెరగబోతోందట. ఈ పరిమితిని ఎనిమిది పెంచబోతున్నారని తెలుస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో ఈ ఫీచర్‌ అందరికీ చాలా ఉపయుక్తంగా ఉండబోతోంది.

వాట్సాప్‌ అకౌంట్‌ను ఒక్క మొబైల్‌లోనే ఎందుకు వాడాలి… నా రెండు ఫోన్లలోనూ యాక్సెస్‌ చేయగలిగితే బాగుంటుంది కదా. మీకూ ఇదే ఆలోచన ఉందా? అయితే మీ మాట వాట్సాప్‌ విన్నదేమో. ఒకే నెంబరుతో రెండు మొబైల్స్‌లో వాట్సాప్‌ వాడేలా మల్టిపుల్‌ డివైజ్‌ సపోర్టును తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం టెలిగ్రామ్‌ లాంటి యాప్‌లు ఈ తరహా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

వాట్సాప్‌ను డెస్క్‌టాప్‌/ల్యాప్‌టాప్‌లో వాడాలంటే… కచ్చితంగా మొబైల్‌ మీ దగ్గర ఉండాల్సిందే.. దానికి నెట్‌ కనెక్టివిటీ ఉండాల్సిందే. అయితే త్వరలో ఈ ఇబ్బంది ఉండదని తెలుస్తోంది. మొబైల్‌ అందుబాటులో లేకపోయినా వాట్సాప్‌ వెబ్‌ వాడేలా మార్పులు చేస్తున్నారట. యూనివర్సల్‌ విండోస్‌ ప్లాట్‌ఫామ్‌ (యూడబ్ల్యూపీ) ద్వారా వాట్సాప్‌ వెబ్ పని చేసేలా మార్పులు చేస్తున్నారు. కాబట్టి మీ మొబైల్‌ స్విచ్ఛాఫ్‌ అయినా వాట్సాప్‌ వాడేయొచ్చు.

ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో సీక్రెట్‌ కన్వర్జేషన్‌ ఫీచర్‌ తెలుసు కదా. ఇప్పుడది వాట్సాప్‌లోకీ రాబోతోంది. అంటే మీరు ఎవరికైనా పంపిన మెసేజ్‌ వాళ్లు చూసిన తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్‌ అయిపోతుంది. అయితే అది ఎంతసేపులో డిలీట్‌ అవ్వాలనేది మీ ఇష్టం. ఈ ఆప్షన్‌ త్వరలో వాట్సాప్‌లోనూ చూడొచ్చు. ఇప్పటికే వాట్సాప్‌ స్టేటస్‌లు 24 గంటల్లో డిలీట్‌ అయిపోతున్న విషయం తెలిసిందే.

 వాట్సాప్‌లో మీ ఛాట్‌ హిస్టరీ, ఫొటోలు, వీడియోలు ఎన్‌క్రిప్ట్‌ రూపంలో మీ గూగుల్‌ డ్రైవ్‌లో బ్యాకప్‌ అవుతుంటాయి. అయితే దీనికి ఎలాంటి రక్షణ ఉండదు. ఇప్పుడు వాట్సాప్‌ బ్యాకప్‌కి కూడా రక్షణ కల్పించాలని నిర్ణయించుకుంది. బ్యాకప్‌ అయిన డేటాను తిరిగి యాక్సెస్‌ చేయడానికి యూజర్‌ కచ్చితంగా పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ పాస్‌వర్డ్‌ను యూజరే క్రియేట్‌ చేసుకోవాలి. దీని వల్ల మీ డేటా ఇతరులు కానీ, ఇతర సంస్థలు కానీ చూసే అవకాశం ఉండదు.

Flash...   Class 1 to Inter All books at One Click for free