స్కూళ్లు, కాలేజీలపై ఫిర్యాదులకు AP Govt. వెబ్‌సైట్ ప్రారంభం

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత
ఏడాదిలో వివిధ పథకాలను నెరవేరుస్తోంది, ప్రజల సంక్షేమం కోసం మరో కొత్త ప్రధాన
కార్యక్రమంతో రెండవ సంవత్సరంలో ఘనంగా అడుగుపెట్టింది. మన పాలన-మీ సుచన ప్రోగ్రాం
పేరుతో ఒక కార్యక్రమాన్ని సోమవారంప్రారంభించింది , ఇది పాలనలో ప్రజల నుండి 
inputs తెలుసుకోవడం కోసం    శుక్రవారం వరకు కొనసాగుతుంది. ప్రణాళికా శాఖ
ఎక్స్ అఫిషియో కార్యదర్శి విజయ కుమార్ దీనిపై ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రోగ్రాం లో
భాగం గా తొలి రోజ్జు విద్య శాఖా పై రివ్యూ జరిగింది . 

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్థల మానిటరింగ్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన
వెబ్‌సైట్‌ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఫీజులు, అడ్మిషన్లు,
పరీక్షలు, ఫిర్యాదులు తదితర విషయాల మానిటరింగ్‌ కోసం ఈ వెబ్‌సైట్‌ను ఏర్పాటు
చేశారు.
తమ దగ్గరున్న వసతులు, తాము పాటిస్తున్న ప్రమాణాలపై స్కూళ్లు, కాలేజీలు స్వయంగా
ఆ వెబ్‌సైట్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేస్తాయని, ఈ డొమైన్‌ అందరికీ అందుబాటులో
ఉంటుందని సీఎం జగన్‌ తెలిపారు.

స్కూళ్లు, కాలేజీలు వెబ్‌సైట్‌లో ప్రకటించిన వివరాలు వాస్తవం కాకపోతే
ఎవరైనా స్పందించి సమాచారం ఇవ్వొచ్చని సూచించారు. ఆ వివరాలు నేరుగా ఈ
కమిషన్ల దగ్గరకు వస్తాయని.. విద్యా రంగంలో కార్పొరేట్‌ సంస్కృతికి చెక్‌
పెట్టడమే ఈ వెబ్‌సైట్‌ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇందుకోసం రెండు కమిషన్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ వెబ్‌సైట్‌
అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు విద్యా రంగంలో
అనేక మార్పులు తీసుకువస్తాయని పేర్కొన్నారు.
website address: http://www.apsermc.ap.gov.in/

Flash...   NIT: వరంగల్‌ NIT లో కొత్త కోర్సు..ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు