ఆ బ్యాంక్‌ కస్టమర్లకు ఆర్‌బీఐ భారీ షాక్.. 6 నెలల వరకు అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడం కుదరదు!

PPLS

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కన్సూర్ కేంద్ర
కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీపుల్స్ కో ఆపరేటివ్ బ్యాంక్‌కు గట్టి షాకిచ్చింది.
కొత్తగా కస్టమర్లకు ఎలాంటి రుణాలు జారీ చేయవద్దని బ్యాంకును ఆదేశించింది.
అంతేకాకుండా కస్టమర్ల నుంచి డబ్బులు డిపాజిట్ కూడా చేయించుకోవద్దని తెలిపింది.
ఆరు నెలల వరకు ఇది వర్తిస్తుందని పేర్కొంది.
జూన్ 10 తర్వాత ఆర్‌బీఐ అనుమతి లేనిదే ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని పీపుల్స్
కోఆపరేటివ్ బ్యాంక్‌కు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. డిపాజిట్ల సేకరణ, డబ్బులు
విత్‌డ్రా, ఇన్వెస్ట్‌మెంట్లు ఇలా పలు అంశాలకు సంబంధించి బ్యాంక్ ఎలాంటి నిర్ణయం
తీసుకోకూడదని స్పష్టం చేసింది. అలాగే బ్యాంకుకు సంబంధించిన ఆస్తులను, అసెట్స్‌ను
విక్రయించడం కూడా కుదరదని పేర్కొంది.
పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అందుకే ఈ మేరకు నిర్ణయం
తీసుకున్నామని రిజర్వు బ్యాంక్ తెలిపింది. అంతేకాకుండా ఆర్‌బీఐ.. బ్యాంక్
కస్టమర్లకు కూడా ఝలక్ ఇచ్చింది. బ్యాంక్ నుంచి డిపాజిటర్లు డబ్బులు విత్‌డ్రా
చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. దీంతో కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది.
కరెంట్ అకౌంట్, సేవింగ్స్ ఖాతా, ఇతర రకాల అకౌంట్లలో ఎంత డబ్బు ఉన్నా కూడా
విత్‌డ్రా చేసుకోవడానికి వీలు లేదని ఆర్‌బీఐ తెలిపింది. ఆరు నెలల వరకు ఆర్‌బీఐ
ఆదేశాలు అమలులో ఉంటాయని పేర్కొంది. అయితే బ్యాంక్ లైసెన్స్ మాత్రం కొనసాగుతుందని
తెలిపింది. ఇంకా ఇతర కార్యకలాపాలు కొనసాగుతాయని వివరణ ఇచ్చింది.
Flash...   పేరు మార్చుకున్న 7 దేశాలు ఇవే.. కారణాలు ఏంటి?