ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై పవన్ కీలక వ్యాఖ్యలు..

కరోనా వైరస్ రోజురోజూకీ తీవ్రరూపం దాల్చుతోంది. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడంపై జనసేన అదినేత పవన్ కల్యాణ్
స్పందించారు. జూలై 10 నుంచి పదో తరగత పరీక్షలు నిర్వహిస్తుండడంపై విద్యార్థుల
తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేస్తుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో
విద్యార్థులను ఆరోగ్యాన్ని ఆపదలోకి నెట్టి వారితో చెలగాటం ఆడడం ప్రభుత్వానికి
ఎంతమాత్రం మంచిదికాదన్నారు. 
పొరుగు రాష్ట్రాలపై తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా,
ఛత్తీస్‌గడ్ వంటి రాష్ట్రాలు ఎక్కడా పరీక్షలు నిర్వహించినా దాఖలాల్లేవని ఆయన
పేర్కొన్నారు. చివరకు ఉన్నత విద్య పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు
చేశారు.
తెలంగాణలో హైకోర్టు సైతం విద్యార్థులకు పరీక్షల నిర్వహణను ఒప్పుకోలేదని
పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజూకీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని,
ఇప్పటికే ఆరు వేలకు పైగా కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. దీనికితోడు ప్రజారవాణ
సైతం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్
కోరారు. ఇతర రాష్ట్రాలు అనుసరించిన విధానాలనే ఏపీలోనూ అనుసరించాలని తెలిపారు.
Flash...   HOW TO CHECK CLASS WISE JVK KIT DISTRIBUTION REPORT IN ONLINE

3 Comments

  1. అవును అది అక్షరాలా నిజం అన్న. ఇంట్లో ఉన్నప్పట్టికీ కరోనా పాకుతునే ఉంది. మరి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో పరీక్షలు నిర్వహించడం సరి కాదు అని అనడంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అక్చరాల నిజం .
    జై పవన్ కళ్యాణ్ "
    జై జనసేన"

  2. హృదయపూర్వక ధన్యవాదాలు సార్ ఎందుకు అంటే ఈ క్లిష్ట పరిస్థితుల్లో పరీక్షలు రాయటమే కాదు పరీక్షలకు సిద్ధం కావడం కూడా చాలా కష్టమైన పని ఇటువంటి సమయంలో పరీక్షలు రద్దు చేయడమే మంచిది

Comments are closed