క‌రోనా టైం : గొంతు నొప్పి.. గ‌ర‌గ‌రా ఉందా.. హోం రెమిడీస్‌….

అసలే కరోనా టైం… అందులోనూ వర్షాలు కూడా జోరుగా కురుస్తున్నాయి. జలుబులు, జ్వరాల
సీజన్ కూడా.. ఇలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కరోనా
వ్యాప్తి విజృంభిస్తున్న సమయంలో ప్రతిఒక్కరూ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.
వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే సీజన్ వ్యాధుల్లో జలుబు, దగ్గు ఎక్కువగా వస్తుంటాయి.
గొంతులో నొప్పిగా అనిపించడం.. ఇలా మరెన్నీ సమస్యలు ఎదురవుతుంటాయి.
కరోనా లక్షణాలు కూడా ఇలానే ఉండటంతో కొంచెం జలుబు, దగ్గు వచ్చినా తెగ
భయపడిపోతుంటారు. ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురయినప్పుడు ఆస్పత్రులకు పరుగులు
పెట్టాల్సిన అవసరం లేదు.. ఇంట్లోనే ఉండి హోం రెమిడీస్ ద్వారా తక్షణ ఉపశమనం
పొందొచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మీలో ఎవరికైనా జలుబు
చేసిందా? గొంతులో నొప్పి.. గరగరా అనిపిస్తోందా? ఈ సింపుల్ హోం రెమిడీస్ ఓసారి
ట్రై చేయండి.. 
 గొంతులో నొప్పి : 
గొంతు నొప్పిగా ఉందా? గొంతులో గరగరా అనిపిస్తుందా? అయితే జాగ్రత్త.. కరోనా
ఇన్ఫెక్షన్ లక్షణాల్లో గొంతు నొప్పి కూడ ఒకటి. గొంతు నొప్పి, పొడి దగ్గుతో పాటు
ఇతర వైరల్ వ్యాప్తి చెందుతుంటాయి. జాగ్రత్త తీసుకోకపోతే మిమ్మల్ని ఇబ్బందుల్లోకి
నెట్టేస్తుంది. 
ఈ హో రెమిడీస్ ట్రై చేయండి :
కరోనావైరస్ లక్షణాలకు అత్యవసరమైన వైద్య సహాయం అవసరం. గొంతు నొప్పిని
నివారించడానికి కొన్ని హోం రెమిడీస్ ప్రయత్నించవచ్చు. ఖర్చు లేని ఐదు సాధారణ
రెమిడీలను ఓసారి ప్రయత్నించి చూడండి.. 
* అల్లం-తేనె లేపనం :
అల్లం-తేనె లేపనంతో బ్యాక్టిరియా, సూక్ష్మజీవులతో వ్యాప్తి చెందే ఇన్ఫెక్షన్లపై
సమర్థవంతంగా పనిచేస్తుంది. అల్లం ఒక మసాలా దినుషులు ఉండటంతో అది గొంతు నొప్పి
లక్షణాలను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. తేనె వాడకం.. మీ శరీరంలోని రోగ
నిరోధక శక్తిని పెంచుతుంది. అల్లం, తేనెతో కలిపిన ఈ ప్రత్యేక మిశ్రమం అధ్బుతంగా
పనిచేస్తుంది. మీ సైనస్ లను రిలీఫ్ చేస్తుంది. శ్లేష్మం బయటకు రావడం, దురద వంటి
సమస్యలను తక్షణమే నివారిస్తుంది.
Flash...   ట్రూకాలర్ అవసరం లేకుండా.. ఫోన్ చేసేది ఎవరో ఇలా కూడా తెలుసుకోవచ్చు !
* ఉప్పునీటితో పుక్కలించడం :

ఉప్పునీటి ద్రావణంతో పుక్కలించడం ద్వారా గొంతు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం
పొందవచ్చు. సూక్ష్మ క్రిములు, వైరస్ లను తగ్గించడానికి ఉత్తమమైన నివారణలలో
ఇదొకటిగా చెప్పవచ్చు. ఫలితాలు సరిగా కనిపించాలంటే ఈ నివారణ క్రియను 3 నుంచి 4
రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించాలి. వాపు, చికాకు వంటి కొన్ని లక్షణాలను
తగ్గించడంలో ఉప్పు నీరు బాగా సాయపడుతుంది. శరీరం ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండటానికి
మంచి మార్గంగా చెప్పవచ్చు. 

* ములేతి (లిక్కర్ రూట్) :

ములేతి.. ఒక సాంప్రదాయ ఆయుర్వేద హెర్బ్ గా చెబుతుంటారు. దీన్ని చాయ్ లో లేదా టీలో
కలుపుకుని తాగుతుంటారు. వైరల్ ఇన్ఫెక్షన్లపై ఈ హెర్బ్ ముక్క అద్భుతంగా
పనిచేస్తుంది. గొంతు వల్ల కలిగే దురదకు ఇది మంచి రిలీఫ్ కూడా. యాంటీ వైరల్
లక్షణాలను కూడా ములేతి కలిగి ఉంది. ఆరోగ్యకరమైన శ్లేష్మాన్ని కూడా ఉత్పత్తి
చేస్తుంది. నొప్పిని కూడా నివారిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మీ
శరీరంలోని రోగ నిరోధక శక్తికి హాని కలిగకుండా నిరోధిస్తాయి. 

* ఆపిల్ సైడర్ వెనిగర్ తాగాలి :

ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)లో ఆల్కలీన్ లక్షణాలు ఉన్నాయి. వాటిలో యాంటీ
ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. దగ్గు, జలుబు చికిత్సకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ
ద్రావణాలలోని యాసిడ్ కంటెంట్ చెడు బ్యాక్టీరియాను వ్యాప్తి చేసే ఇన్ఫెక్షన్‌ను
తొలగించడంలో సాయ పడుతుంది. గొంతులో మంటను తగ్గిస్తుంది. లక్షణాల నుంచి ఉపశమనం
పొందాలంటే.. ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి ఒక గ్లాసు గోరువెచ్చని
నీటీతో తాగాలి. అదనపు రుచి కోసం తేనెను కూడా కలిపి తాగవచ్చు.