గిన్నీస్ రికార్డ్ నెలకొల్పిన 8 కుక్కలు… చూస్తే ఆశ్చర్యమే… వైరల్ వీడియో

జర్మనీకి చెందిన 12 ఏళ్ల డాగ్ ట్రైనర్  గిన్నీస్ బుక్ రికార్డ్ బ్రేక్
చేసింది. మొత్తం 8 కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చి  వాటితో కొంగ (conga) చేయించి.
ఆమె ఈ రికార్డ్ సాధించింది. కొంగ అంటే  అదో లైన్. కుక్కలన్నీ  ఒక దాని
వెనక ఒకటిగా రెండు కాళ్లతో నిల్చోవాలి. అలాగే నడవాలి. ఈ కొంగలో ఏ కుక్కా కింద
పడకూడదు. లైన్ తప్పకూడదు. అలెక్సా తన కుక్కలకు కొంగను బాగా నేర్పించింది. ఫలితంగా
గిన్నీస్ బుక్ వారి ముందు అద్భుత ప్రదర్శన ఇచ్చి… వరల్డ్ రికార్డ్
నెలకొల్పింది. ఇప్పటివరకూ కొంగ లైన్‌లో ఎక్కువ కుక్కలు నిలబడటం ఇదే తొలిసారి.
నిజానికి కొంగ అనేది ఒకరకమైన డాన్స్. లాటిన్ అమెరికా దేశాల్లో ఒక వ్యక్తి వెనక
మరో వ్యక్తి నిలబడి… చైన్ లాగా ఏర్పడతారు. ఆ డాన్స్ ప్రేరణగా అలెక్సా. తన
కుక్కలకు కొంగను నేర్పించింది. ఈ కుక్కల్లో అలెక్సాను ముందుగా సల్లీ డాగ్
పట్టుకోగా సల్లీ వెనక… మిగతా కుక్కలన్నీ సైజ్ వారీగా పట్టుకొని నిలబడ్డాయి. ఆ
తర్వాత అలెక్సా వెనక్కి నడుస్తూ కుక్కల్ని తనవైపు నడిపించింది. అన్నీ బుద్ధిగా
నడిచి… ఆమె కలలను సాకారం చేశాయి. ఈ కుక్కలు మొత్తం 16 అడుగుల 6 అంగుళాల వరకూ
లైన్ ఏర్పాటు చేశాయి.
ఇలాంటి రికార్డ్ ఒకటి ఉంటుందనే చాలా మందికి తెలియదు. దీన్ని సాధించడం కూడా
కష్టమే. 8 కుక్కల్లో ఒక్కటి తేడాగా చేసినా… మొత్తం కష్టం వృథా అయ్యేదే. అందుకే
గిన్నీస్ వారు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
ప్రపంచవ్యాప్తంగా దీన్ని 14 లక్షల మందికి పైగా చూశారు. 7లక్షలకు పైగా వ్యూస్
వచ్చాయి. 700కు పైగా షేర్ చేశారు. కామెంట్లు టన్నుల కొద్దీ వస్తున్నాయి. ఆ
కుక్కలకు అలెక్సా బాగా ట్రైనింగ్ ఇచ్చిందని చాలా మంది అంటున్నారు.

Flash...   APPSC Age Limit: నిరుద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..!