గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీ ఉన్న 17,097 పోస్టుల భర్తీ


అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీ ఉన్న 17,097 పోస్టుల భర్తీకి అన్నిరకాల
చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి జగన్ కు అధికారులు తెలిపారు. జూలై నెలాఖరులో
పరీక్షలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నామని అధికారులు వివరించారు. వైద్యశాఖలో
ఖాళీగా వున్న పోస్టులు, గ్రామ-వార్డు సచివాలయాల్లో పోస్టులు అన్నీ కలిపి ఒకేసారి
షెడ్యూల్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు.


గ్రామ, వార్డు సచివాలయాలు, వార్డు వాలంటీర్ల వ్యవస్థపై సీఎం జగన్‌ సమీక్షా
సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మౌలిక సదుపాయాలపై సీఎం
అధికారులతో చర్చించారు. లబ్ధిదారుల జాబితా, గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన
నంబర్ల జాబితా, ప్రకటించిన విధంగా నిర్ణీత కాలంలో అందే సేవల జాబితా, ఈ ఏడాదిలో
అమలు చేయనున్న పథకాల క్యాలెండర్‌ను అన్ని గ్రామ, వార్డు, సచివాలయాల్లో ఉంచాలని
సీఎం ఆదేశించారు.

Flash...   Website to capture the student details i.e.Shoe Size, Availability of TV, Internet, Cable, DTH, Computer