త్వరలో MEO ల బదిలీలు. రాష్ట్రంలో 215 ఎంఈవో పోస్టుల ఖాళీ

అడహాక్ పదోన్నతులు ఇవ్వాలన్న వినతిపై సానుకూలంగా స్పందించిన విద్యాశాఖ మంత్రి
సురేష్.
విశాలాంధ్రబ్యూరో అమరావతి : రాష్ట్రంలో మండల విద్యాశాఖాధికారుల (ఎంఈవో) బదిలీలకు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సానుకూలంగా స్పందించారు.
ప్రస్తుత ఖాళీ పోస్టుల భర్తీతోపాటు బదిలీలు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని 675
ఎంఈవో పోస్టుల్లో సుమారు 215 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 470 మంది
ఎంఈవోలు పని చేస్తున్నారు. 
ఈ నెలలో పది మంది పదవీ విరమణ చేయనున్నారు. ఒక్కొక్కరు రెండు మండలాలకు ఇన్ ఛార్జ్
గా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతోపాటు బదిలీలు
చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మండల విద్యాశాఖాధి కారుల సంఘం అధ్యక్షుడు ఆదూరి
వెంకటరత్నం కోరారు. ఈ మేరకు ఆయన నేతృత్వంలోని బృందం విద్యాశాఖ మంత్రి డాక్టర్
ఆదిమూలపు సురేష్ కు వినతిపత్రం సమ ర్పించింది. ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్,
పాఠశాల విద్య కమిషనర్ వి చిన వీరభద్రుడును కలసి వివరాలు అందజేసింది. ఈ విషయంలో
మంత్రి సానుకూలంగా స్పందించడంతో బదిలీలకు కసరత్తు జరుగుతోంది
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సీనియర్ ప్రధానో పాధ్యా యులకు అడహాక్ విధానంలో
పదోన్నతులు కల్పించి మండల విద్యాశాఖాధికారులుగా నియమిం చాలన్న సంఘం విన్నపంపై
మంత్రి సాను కూలంగా స్పందిం చారు. విద్యారంగంలో సంస్కరణలను వేగవంతంగా అమలు
చేయడంతోపాటు పర్యవేక్షణకు ఎంఈవోల అవసరం ఉన్న నేపథ్యంలో ఖాళీలను భర్తీ చేసే
ఆలోచనలో విద్యాశాఖ ఉంది. ఐదేళ్ల సర్వీసు నిండిన ఎంఈవోలను బదిలీ చేసే అంశాన్ని
పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఎంఈవోల సంఘం అధ్యక్షుడు వెంకటరత్నం
మాట్లాడుతూ బదిలీలకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. కొత్త విద్యా సంవత్సరం
ప్రారంభమయ్యేలోపు బదిలీలు, ఖాళీల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
Flash...   Celebration of Andhra Pradesh Formation Day scheduled on 01.11.2020