పదో తరగతి పరీక్షల నిర్వహణపై నిర్ణయం

పదవ తరగతి పరీక్షలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్షించి సాయంత్రం లోపు నిర్ణయం తీసుకుంటామన్నారు. పరీక్షల నిర్వహణపై ఉన్న అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నామన్నారు. కర్నాటకలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు కూడా అనుమతి ఇచ్చిందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణపై 23 తేదీలోగా పూర్తి నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖల అధికారులను కోరిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారని వెల్లడించారు. తాము కూడా అధికారులతో సమీక్షించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు
Flash...   AP ICET ‌– 2020 ఫలితాల వెల్లడి