పాఠశాలలు తెరవడాన్ని బహిష్కరిస్తున్నాం:FAPTO

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వారంలో మూడు రోజుల పాటు పాఠశాలలు తెరవాలన్న
ప్రభుత్వ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ
సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) పేర్కొంది.రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం మేరకు మంగళ, బుధ,
శుక్రవారాల్లో పాఠశాలలు తెరవడాన్ని బహిష్కరిస్తున్నట్లు ఛైర్మన్ జీవీ నారయణరెడ్డి,
సెక్రటరీ జనరల్ కె.నరహరి తెలిపారు. 

ఈ మేరకు వారు పాఠశాల విద్యా కమిషనర్ కు ఓ లేఖ రాస్తూ దూరదర్శన్ ద్వారా బ్రిడ్జి
కోర్సుల నిర్వహణకు తేదీలు ప్రకటించి విద్యార్థుల సందేహాల నివృత్తికి ఉపాధ్యాయులు,
విద్యార్థులను ఆ మూడు రోజుల పాటు హాజరు కావాలని ఆదేశించినట్లు వారు తెలిపారు.
దీనిపై తాము స్పష్టత కోసం లేఖ రాసినా ఇప్పటివరకు స్పందన లేదన్నారు. 
ఆగస్టు 15వ తేదీ వరకు పాఠశాలలు తెరవరాదంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన
నేపధ్యంలో మధ్యలో పాఠశాలలు తెరవడం మంచిది కాదని వారు పేర్కొన్నారు. ఇప్పటికే
కొన్ని రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసినట్లు పేర్కొంటూ విద్యార్థులు,
ఉపాధ్యాయులకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ వారు ప్రశ్నించారు. ఇలాంటి
పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాము మంగళ, బుధ, శుక్రవారాల్లో పాఠశాలలు
తెరవడాన్ని బహిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు.
PRTU REPRESENTATION: 
గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి వర్యులు
 ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం
ఆర్యా..!
విషయం:- పాఠశాల విద్య – బ్రిడ్జ్ కోర్సు – ప్రస్తుతం పాఠశాలలకు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు కావాలనే నిర్ణయం ను వాయిదా వేయాలని – విజ్ఞప్తి.
సూచిక:-Proc.Rc.No./280/2020- Com SE – CSE,  Dt:07-06-2020
        ***
పైన కనబర్చిన  ఉత్తర్వులు, పాఠశాల విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సు   ప్రస్తుత పరిస్థితులలో *దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు నిర్వహించడం, విద్యార్థులలో నైపుణ్యాబివృద్ది కి దోహదపడును. 
కాని, ఈ నెల 16 తేది నుంచి వారానికి ఒక సారి, Primary/UP & High school HMs , Teachers  మరియు విద్యార్ధులను పాఠశాలకు హాజరు కావాలని సూచించడం, ప్రస్తుత రాష్ట్రంలో రోజు రోజు COVID 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో,  చాలా పాటశాలలు Covid quarantine కు ఉపయోగించారు. ఇంకొన్ని పాఠశాలలలో నాడు నేడు పనులు జరుగుతున్నాయి. కావున ప్రస్తుతం  విద్యార్ధులను సమూహ పర్చడం వల్ల వివిధ ప్రాంతాలనుండి  విద్యార్థుల హాజరవుతారు (కొంతమంది కంటోన్మెంట్ జోన్ పరిధిలోని విద్యార్థులు కూడా వుంటారు)  .  ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పాఠశాలకు విద్యార్ధులు మరియు ఉపాధ్యాయుల హాజరు కావాలనే నిర్ణయం ను పునః సమీక్ష  చేసి వాయిదా వేయాలని  లేని పక్షంలో PRTU  బహిష్కరిస్తుందని తెలియచేస్తున్నాం.
ధన్యవాదాలతో..
మిట్టా కృష్ణయ్య
రాష్ట్ర అధ్యక్షుడు,
వి. కరుణానిధి మూర్తి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, ఆంధ్రప్రదేశ్.
PRTUAP
Flash...   Pending provlslonal Pension Cases information Called for