రుతుపవనాలు వచ్చేశాయ్

మండుతున్న ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజయవాడ వాతావరణ
కేంద్రం ‘చల్లని కబురు’ చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని
తాకినట్లు వెల్లడించింది. కేరళ రాష్ట్రం నుంచి సోమవారం నైఋతి రుతుపవనాలు ఏపీలోకి
ప్రవేశించినట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్
దీవులు, మాల్దీవులు, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లోని కొన్ని ప్రాంతాలు,
కోమోరిన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు
విస్తరించాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు
తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం
వెల్లడించింది. 

రాబోయే మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30 నుంచి 40 కిలో
మీటర్లు)తో ఉత్తర కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు
వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం
తెలిపింది.
Flash...   Great App for LKG to 5th Grade during lockdown