విద్యార్ధులకు మైకుల్లో పాఠాలు చెబుతున్న మాస్టారు: కరోనా క్లాసులు..హలో..హలో

కరోనా కాలంలో విద్యార్ధులు పాఠాలు నేర్చుకునే తీరే మారిపోయింది. స్కూల్ కు వెళ్లే
పనేలేకుండా పోయింది. పొద్దున్నే లేవటం..స్నానాలు..హోమ్ వర్కులు..ప్రాజెక్టులు ఇలా
అన్నీ పోయాయి. ఒకప్పుడుఅంటే కరోనాకు ముందు విద్యార్దులు క్లాసులో కూర్చుంటే
టీచర్లు వచ్చి పాఠాలు చెప్పేవారు. కానీ ఇప్పుడు కరోనా పుణ్యమాని ఆన్ లైన్
క్లాసులు..రేడియోల్లో పాఠాలు చెబుతున్నారు మాస్టార్లు. అంతేకాదు ఇప్పుడు మరోరకంగా
కూడా పాఠాలు చెప్పేస్తున్నారు మాస్టార్లు. ఎలాగంటే మైకుల్లో క్లాసులు..! ఊరందరికీ
విషయం చెప్పాలంటే మైకుల్లో  (లౌడ్ స్పీకర్లు)చెప్పేవారు. ఇప్పుడు కరోనా
కాలం. క్లాసుల ట్రెండే మారిపోయింది. భౌతిక దూరం పేరుతో పాఠాలు చెప్పేస్టైల్
మారిపోయింది. 

లాటిన్ అమెరికా ప్రాంతంలోని కొలంబియాలో రేడియో పాఠాలు చెబుతున్నారు. ఆ దేశంలో
ఇంటర్నెట్‌ పెద్దగా అందుబాటులో లేకపోవడంతో లాటిన్ అమెరికా ప్రభుత్వం రేడియోలో
పాఠాలు చెప్పేలా ఏర్పాటు చేసింది. టీచర్లు రేడియో స్టేషన్‌కు వెళ్లి పిల్లలకు
పాఠాలు చెబుతున్నారు. ఆ పాఠాలను పిల్లలు పెద్దల సహకారంతో 
వింటున్నారు. 

ఇదిలావుండగా ఇంటర్నెట్‌, లాప్‌టాప్‌, స్మార్ట్‌‌ఫోన్లు లేని విద్యార్థుల కోసం
జార్ఖండ్‌లోని బంకతి మిడిల్‌ స్కూల్‌ హెడ్‌‌మాస్టర్‌ శ్యామ్‌ కిషోర్‌ గాంధీ
స్కూల్‌ చుట్టూ..మైక్‌లు పెట్టించారు. ఐదుగురు టీచర్లు స్కూల్ నుంచి  పాఠాలు
చెబుతుంటే పిల్లలు వినేలా ఏర్పాట్లు చేశారు. పిల్లలకు ఏదైనా డౌట్స్ వస్తే తమ
ఫోన్‌కు కానీ..స్కూల్ స్టాఫ్‌ ఫోన్‌కు మెసేజ్‌ చేస్తే డౌట్స్ తీర్చేలా ఏర్పాటు
చేశారు. 

మెజేస్ చూసుకున్న వారు మరునాడు ఆ డౌట్స్ క్లియర్ చేస్తారు. ఏప్రిల్‌ 16 నుంచి
ప్రతిరోజూ రెండు గంటల పాటు మైకుల్లో పాఠాలు చెబుతూ క్లాసెస్ నిర్వహిస్తున్నారు.
దీనిపై ఆ స్కూల్ హెడ్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు
మాస్కూల్లో  246 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు

Flash...   మాస్కులు అతిగా వాడితే...ప్రమాదమా..!