ఈ రోజు భారత్‌లో కొత్తగా 11,929 కరోనా కేసులు


న్యూఢిల్లీ
: దేశంలో రోజురోజుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య
పెరుగుతూపోతోంది. నిన్న 11,458 కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో 11,929
కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,20,922కు చేరింది. ఈ
మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల
చేసింది.  భారత్‌లో గడిచిన 24 గంటల్లో 311 మంది, ఇప్పటివరకు 9195 మంది
మృత్యువాత పడ్డారు.
 ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,49,348గా ఉంది. కరోనానుంచి కోలుకుని
మొత్తం 1,62,378 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కాగా, కరోనా కేసుల సంఖ్య నిన్న 3
లక్షలు మార్కు దాటిపోయి ప్రపంచ జాబితాలో భారత్‌ నాలుగో స్థానానికి చేరుకుంది.
అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత స్థానంలో భారత్‌ ఉంది.
దేశ రాజధానిలో కరోనా విజృంభణ

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో
2,134 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38,958కి
చేరుకుంది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీ ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల
చేసింది. రాజధానిలో 24 గంటల్లో 57 మంది మరణించగా.. మొత్తం 1,271మంది మృత్యువాత
పడ్డారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 22,742గా ఉంది. ఇప్పటివరకు 14,945
మంది కోలుకుని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కాగా, ఢిల్లీలో కరోనా కేసులు
40 వేలకు చేరుకుంటున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు అమిత్‌షా నేతృత్వంలో
అధికారులు సమావేశం కానున్నారు. ఢిల్లీలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై
చర్చించనున్నారు.
Flash...   వైఎస్ జగన్ పై ప్రశంసలు కురిపించిన పవన్...