ఉప్పు నీళ్లతో కరోనా ఖతమే.. స్వల్ప లక్షణాలు కనిపిస్తే ఇలా చేయండి.. సైంటిస్టులు ఇదే చెబుతున్నారు!

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. కరోనా టెస్టులు
ఎక్కువ మొత్తంలో చేయడంతో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా
కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా బారిన
పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా అందరూ ముఖానికి మాస్క్ ధరించాలి. సామాజిక దూరాన్ని
పాటించాలి.

అలాగే తరచుగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలని అందరూ ఇదే సూచిస్తున్నారు. అయితే,
కరోనా వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు
సురక్షితంగా ఉండాల్సిన సమయం ఇది. ఇంతకీ, కరోనా సోకినా ఆరంభంలోనే వైరస్ ను అంతం
చేయలేమా? అంటే అవునుని అంటోంది ఓ అధ్యయనం. కరోనాను ఆరంభంలోనే నిరోధించవచ్చునని
చెబుతోంది. సాధారణంగా అందరికి ఉప్పుతో కలిగే ప్రయోజనాలు ఏంటో ప్రత్యేకించి
చెప్పనక్కర్లేదు. 

ఒక సాధారణ ఉప్పునీటి పరిష్కారంతో కరోనా ప్రారంభ లక్షణాలను వెంటనే నయం
చేయవచ్చునని  ఈ రీసెర్చ్ చెబుతోంది. కరోనావైరస్ సోకినట్టు ఎలాంటి స్వల్ప
లక్షణాలు కనిపించినా ఉప్పునీటితో నివారించవచ్చునని ఈ కొత్త పరిశోధన సూచించింది.
Edinburgh believeకు చెందిన శాస్త్రవేత్తల ప్రకారం.. సముద్రపు ఉప్పుతో జలుబుతో
బాధపడేవారిలో కణాల యాంటీవైరల్ రక్షణను పెంచుతుందని గట్టిగా చెబుతున్నారు. ఈ కొత్త
అధ్యయనం 2019లో ప్రచురించిన ఒక ట్రయల్ ఆధారంగా వచ్చింది. ఉప్పునీటి ద్రావణంతో
ముక్కును శుభ్రపరిచాలి. ముక్కును శుభ్రపరిచిన వారిలో జలుబు, దగ్గు తగ్గిపోవడాన్ని
గుర్తించినట్టు సైంటిస్టులు వెల్లడించారు.

ఇప్పుడు.. కోవిడ్ -19 లక్షణాలతో ఉన్నవారికి ఇదే పరిష్కారం పనిచేస్తుందా? అని
సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. స్కాట్లాండ్‌లోని పరిశోధకులు ఈ ట్రయల్స్‌లో
పాల్గొనడానికి పెద్దలను నియమించుకున్నట్టు తెలిపారు. యూనివర్శిటీలోని Usher
Institute డైరెక్టర్ ప్రొఫెసర్ Aziz Sheikh చెప్పిన ప్రకారం.. ‘కోవిడ్ -19
అనుమానిత లక్షణాలు లేదా కరోనా అని తేలిన వారిలో ఉప్పునీటి రెమిడీతో
పరీక్షించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ఈ ఉప్పు నీళ్లతో పరిష్కారం.. కరోనా వ్యాప్తిని తగ్గించగలదని నిరూపిస్తుందని
ఆశిస్తున్నామని చెప్పారు. ఉప్పు, నీటిని ఉపయోగించే విధానం గురించి కొంత అవగాహన
ఉంటే సరిపోతుంది. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే ఈ విధానాన్ని అనుసరించడం చాలా
సులభమైనది కూడా. పైలట్ అధ్యయనంలో పాల్గొన్న వారిలో సగం మంది Edinburgh,Lothians
వైరల్ ఇంటర్వెన్షన్ స్టడీ, లేదా ELVIS అని పిలుస్తారు. 

Flash...   Currency: ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయా? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం