ఏపీని వణికిస్తున్న కరోనా: కొత్తగా 180 కేసులు

carona

ఏపీపై కరోనా పంజా విసురుతూనే ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారు, లోకల్ కాంటాక్ట్,
వలస కూలీలతో కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 8,066
శాంపిల్స్‌ను పరీక్షించగా 79 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా
బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 94మంది ..
విదేశాల నుంచి వచ్చిన మరో ఏడుగురికి కరోనా నిర్థారణ అయ్యింది. ఈ మొత్తం కేసుల సంఖ్య
180 నమోదయ్యాయి. కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం
తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 3279కు చేరాయి. మరో 35మంది వైరస్
నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల
సంఖ్య 967కు చేరింది.

 

రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 700పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 450కు పైగా కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2244మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 68మంది చనిపోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల నలుగురు చనిపోయారు.. చిత్తూరు జిల్లాలో ఇద్దరు.. కృష్ణా జిల్లా, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి.
Flash...   Hetero Drugs: Injection for Covid - కోవిఫర్