ఏపీ కరోనా అలర్ట్: కొత్తగా 115 కేసులు.. భయపెడుతున్న కమ్యులేటివ్ కేసులు

CARONA-NEW
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. లోకల్ కాంటాక్ట్, విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా రోజు రోజుకు పాజిటివ్ క కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 12,613 శాంపిల్స్‌ను పరీక్షించగా 82 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.. ఇతర కేసులు 33 ఉన్నాయి.. మొత్తం కలిపితే 115 నమోదయ్యాయి. కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 3200కు చేరాయి. మరో 40మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 927కు చేరింది. 

రాష్ట్రంలో కొత్త నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కమ్యులేటివ్ పాజిటివ్ కేసులు 479 (వీటిలో యాక్టివ్ కేసులు 282) ఉన్నాయని ప్రకటించారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన 112మందికి వైరస్ సోకినట్లు తెలియజేశారు.అయితే కోయంబేడు లింకులతో పాటూ విదేశాల నుంచి వచ్చిన వారితో టెన్షన్ వెంటాడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అందుకే ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహిస్తోంది.
Flash...   కరోనా వైరస్‌ మలి దశ పంజా! భారత్‌కు ‘సెకండ్‌వేవ్‌’ భయం!

1 Comment

Comments are closed