కరోనాకు ఇలా చెక్ పెట్టొచ్చు!

రోజు రోజుకు కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది.  ఇండియాలో కేసులు ఐదు లక్షలకు చేరువలో ఉన్నాయి.  దీనికి పూర్తిస్థాయి మెడిసిన్ వచ్చే వరకు తగిన జాగ్రత్తల్లో ఉండాలి.  చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్ రాసుకోవడం వంటివి చేస్తుండాలి.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా మహమ్మారి వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు.  విస్తరిస్తూనే ఉన్నది.  సాధారణ ప్రజలతో పాటుగా, ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పోలీసులు సైతం అధిక సంఖ్యలో ఈ వైరస్ బారిన పడుతున్నారు.  
ఈ నేపథ్యంలో కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులు కొన్ని కొత్త పద్దతులను కనుగొన్నారు.  భారతీయ వంటకాల్లో వినియోగించే ఆవనూనె, నిమ్మకాయ కలిపిన వేడినీళ్లను తీసుకుంటే కరోనా నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని బెంగాల్ పోలీసులు చెప్తున్నారు.   ఆవనూనె, నిమ్మరసంను వేడి నీళ్లలో కలిపి తీసుకుంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని బెంగాల్ పోలీసులు చెప్తున్నారు.  కొన్ని రోజుల క్రితం డార్జిలింగ్ జంక్షన్ లోని ఓ పోలీసుకు, అతని భార్యకు కరోనా సోకింది.   పోలీసు అధికారుల సూచనల మేరకు ఈ చిట్కా పాటించడంతో రెండు రోజుల్లోనే వారి ఆరోగ్యం మెరుగైందని పోలీస్ కమీషనర్ పేర్కొన్నారు.  కరోనా నియంత్రణలో ఆవనూనె, నిమ్మరసం, వేడినీళ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పోలీసులు చెప్తున్నారు.  
Flash...   ఆరోగ్య‌శ్రీ‌లోకి బ్లాక్‌ఫంగ‌స్.