కరోనాకు మరో మందు.. సిప్రెమీని ప్రారంభించిన సిప్లా

కరోనాకు మందు లేదు అని ఇన్నాళ్లూ అనుకున్నాం. కానీ ఇప్పుడు ఫాబిఫ్లూ (FabiFlu),
కోవిఫోర్ (Covifor) వచ్చేశాయి. వీటికి తోడుగా ఇప్పుడు ఇండియన్ ఫార్మా కంపెనీ
సిప్లా… సిప్రెమీ (Cipremi) పేరుతో మరో మందును తెచ్చింది. కోవిఫోర్‌ను హెటెరో
ఫార్మా కంపెనీ… రెమ్‌డెసివిర్‌తో తయారుచేయగా… సిప్లా కూడా అదే
రెమ్‌డెసివిర్‌తో… సిప్రెమీని తయారుచేసింది. ఇది కూడా కోవిఫోర్ లాగా…
ఇంజెక్షన్ లాగే ఉంటుంది. రెండు కంపెనీలూ… వేర్వేరు పేర్లతో ఇంజెక్షన్‌ను
తయారుచేశాయి. తమ సొంతంగా, ఇతర సంస్థలతో కలిసి… సిప్రెమీని ఉత్పత్తి చేస్తామని
ముంబైకి చెందిన సిప్లా తెలిపింది.
భారత్ కు చెందిన మల్టీనేషనల్ ఔషధ మరియు  బయోటెక్నాలజీ సంస్థ
సిప్లా…COVID-19 రోగులకు ట్రీట్మెంట్  కోసం  సిప్రెమి అనే
పేరుతో   యాంటీవైరల్ డ్రగ్ ను లాంచ్ చేసింది. 100 ఎంజి  ఇంజెక్షన్
కోసం ఈ మెడిసిన్  లైయోఫైలైజ్డ్ పౌడర్ (ఫ్రీజ్ డ్రై) రూపంలో ఉఉంటుందని సిప్లా
కంపెనీ తెలిపింది .ఈ ఔషధాన్ని ప్రభుత్వం మరియు మార్కెట్ మార్గాలు రెండూ
విక్రయిస్తాయి.
కరోనా ఇన్ఫెక్షన్ కు సిప్రెమి మందు
COVID-19 సంక్రమణకు ‘సిప్రెమి’ అనే ఔషధం.. ఆసుపత్రిలో చేరిన పెద్దలు మరియు
పీడియాట్రిక్ రోగుల కోసం  ఆమోదించబడింది. కరోనా వైరస్ సోకి అనారోగ్యానికి
గురైన తర్వాత ఆక్సీజన్ సపోర్ట్ పై ఉన్నవారికి  కొత్తగా తీసుకొచ్చిన ఈ
డ్రగ్  మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అమెరికాలో FDA… కరోనా పేషెంట్లకు
రెమ్‌డెసివిర్‌ను కరోనాతో బాధపడుతున్న పెద్దవాళ్లకు, పిడియాట్రిక్ పేషెంట్లకు
ఇవ్వొచ్చని అనుమతించింది. అందువల్ల ఇది కరోనాకి సరైన మందుగా ప్రస్తుతానికి
భావిస్తున్నారు. మన దేశంలో DCGI… సిప్లా డ్రగ్‌ను ఎమర్జెన్సీ పరిస్థితుల్లో
మాత్రమే వాడాలని చెప్పింది. అంటే… కరోనా అంతంతమాత్రంగా ఉండేవారికి సిప్రెమీ
ఇవ్వకూడదన్నది ఉద్దేశం కావచ్చు. ఎందుకంటే… రెమ్‌డెసివిర్ అనేది చాలా పవర్‌ఫుల్
మందు కావడమే.

సిప్రేమి ధర
మార్కెట్లోకి  ఈ  కొత్త  డ్రగ్ ను  విడుదల చేసినప్పటికీ,
కంపెనీ ధరను ఇంకా వెల్లడించలేదు.
సిప్లాకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ(DCGI) అనుమతి 
Flash...   ఎన్95 మాస్కులపై కేంద్రం హెచ్చరికలు
అత్యవసరమైన మరియు అపరిష్కృతమైన వైద్య అవసరాన్ని పరిగణనలోకి తీసుకొని వేగవంతమైన
ఆమోద ప్రక్రియలో భాగంగా సిప్లాకు దేశంలో అత్యవసర వినియోగాన్ని పరిమితం చేయడానికి
డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) రెగ్యులేటరీ అనుమతి ఇచ్చింది. రిస్క్
మేనేజ్‌మెంట్ ప్లాన్‌లో భాగంగా, సిప్లా…ఔషధ వినియోగంపై,సమాచారం ఇచ్చిన రోగి
సమ్మతి పత్రాలు, మార్కెటింగ్ అనంతర పర్యవేక్షణతో పాటు భారతీయ రోగులపై ఫేజ్ IV
క్లినికల్ ట్రయల్ నిర్వహించడంపై  ట్రైనింగ్ ఇస్తుంది. 
 
ఇప్పటికే సిప్లా… మూడు ట్రయల్స్ పూర్తి చేసింది. త్వరలో డ్రగ్ సరఫరా చేసి… ఆ
తర్వాత నాలుగో క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తామని తెలిపింది. సిప్లా తన ట్రయల్ 1లో
అమెరికా, యూరప్, ఆసియాలో 60 చోట్ల… 1063 మంది పేషెంట్లపై (ఎక్కువ మంది ఆక్సిజన్
సపోర్టుతో ఉన్నవారు)… డ్రగ్‌ను పరీక్షించింది. చాలా త్వరగా పేషెంట్లు
కోలుకున్నట్లు గుర్తించింది. మరణాల రేటు 7.1గా ఉన్నట్లు తెలుసుకుంది. మొత్తానికి
కరోనాకి వ్యాక్సిన్ వచ్చేలోపు… రకరకాల మందులు తెరపైకి వచ్చేస్తున్నాయి.