కేంద్రానికి జగన్ లేఖ..ఏమనంటే ( ప్రవాసాంధ్రులను స్వదేశానికి తీసుకురావాలని)

jagan-letter

ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. లాక్ డౌన్ కారణంగా వివిధ
దేశాలలో చిక్కుకుని ఉన్న ప్రవాసాంధ్రులను ఫ్లైట్స్ ఎక్కువ నడిపి స్వదేశానికి
తీసుకురావాలని సీఎం జగన్ ఆ లేఖలో కోరారు. నేటి నుంచి జూలై 1 వరకు “వందేభారత్‌
మిషన్‌ ఫేజ్‌-3” కొనసాగనుంది. కరోనా ప్రభావంతో విదేశాల్లో చిక్కుకున్న వారిని
“వందేభారత్‌ మిషన్”‌ లో భాగంగా స్వదేశానికి తీసుకువస్తోంది కేంద్రం. వందేభారత్‌
మిషన్‌ ఫేజ్‌-3 లో 43 దేశాల నుంచి 60 వేల మంది తరలింపునకు ఏర్పాట్లు చేసింది భారత
విమానయాన శాఖ.

వందేభారత్‌ మిషన్‌ ఫేజ్‌-3 లో వివిధ దేశాల నుంచి 300 విమానాలు ఎయిర్ ఇండియా
నడపనుంది. యూరప్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, యుకె, ఆఫ్రికా దేశాల నుంచి భారీగా
స్వదేశానికి ప్రయాణికులు ఈ మిషన్ ద్వారా రానున్నారు. ఈ క్రమంలో ఫ్లైట్స్ ఎక్కువ
నడిపి ప్రవాసాంధ్రులను వెనక్కు తీసుకు రావాలని జగన్ కోరారు. విదేశాల్లో
చిక్కుకుపోయిన భారతీయుల్ని తీసుకొచ్చేందుకు కేంద్ర విదేశాంగశాఖ నిర్వహిస్తున్న
వందే భారత్ మిషన్ అభినందించాల్సిన విషయమని ఆయన అన్నారు.

ఈ మిషన్ కింద ఏపీకి సంబంధించిన వారిని తీసుకొచ్చేందుకు తక్కువ విమానాలు
కేటాయించారని తెలిసిందని  ఏపీకి కూడా విమన సర్వీసుల్ని పెంచాలని సీఎం
కోరారు. విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాలు ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వారిని
భారత్‌కు తరలించేందుకు అక్కడ ఉన్న చార్టెడ్ విమానాలు నడిపేందుకు అవకాశం ఇవ్వాలని
కోరుతున్నాయని చార్టెట్ విమానాలు రాష్ట్రంలో ఏ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేసేందుకు
ఇబ్బందులు లేవని వాటికి కూడా అనుమతులు ఇచ్చే ఏర్పాట్లు చేయాలని
అన్నారు.  

Flash...   Guidelines for opening of Yoga Institutes & Gymnasiums