జాగర్త …200 అకౌంట్స్‌ను డిలీట్ చేసిన ఫేస్‌బుక్.. రీజన్ ఇదే

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. విద్వేశాలు
రెచ్చగొట్టేలా అకౌంట్స్‌లో పోస్టింగ్స్‌ చేస్తున్న పలు అకౌంట్లను
తొలగించింది.

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. విద్వేశాలు
రెచ్చగొట్టేలా అకౌంట్స్‌లో పోస్టింగ్స్‌ చేస్తున్న పలు అకౌంట్లను తొలగించింది.
గతంలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది. తాజాగా అమెరికాలో జరుగుతున్న ఆందోళనలకు
సంబంధించి ప్రజల్లో విద్వేశాలను ప్రేరేపించేలా ఉన్న 200 అకౌంట్స్‌ను డిలిట్
చేసినట్లు ఫేస్‌బుక్ తెలిపింది. 

ఈ అకౌంట్లు శ్వేత జాతీయుల గ్రూపులకు అనుసంధానించి ఉన్నాయని పేర్కొంది.
ఇంతకు ముందు డిలీట్ చేసిన అమెరికన్ గార్డ్ గ్రూపులతో కూడా ఈ అకౌంట్లు
మ్యూచ్‌వల్‌గా ఉన్నట్లు వెల్లడించింది. రెచ్చగొట్టే ప్రసంగాలు పోస్ట్
చేసినందుకు ఆ అకౌంట్లను డిలీట్ చేసింది ఫేస్‌బుక్. అమెరికాలో జరుగుతున్న
ఆందోళనల్లో మద్దతుదారులతో పాటు.. 
ఆ అకౌంట్‌లకు సంబంధించిన గ్రూప్‌ సభ్యులు పాల్గొనేలా చేసినట్లు
వీడియోల్లో చూశామని.. అంతేకాదు.. వాటిలో విధ్వంసం సృష్టించే విధంగా
ప్రేరేపించేలా ఉన్నాయని.. ఫేస్‌బుక్‌కు సంబంధించిన అధికారి ఒకరు
పేర్కొన్నారు.

Flash...   పాసైతేనే పెర్మినెంట్‌- సచివాలయ కార్యదర్శుల మెడపై పరీక్షల కత్తి