జియో బంప‌ర్ ఆఫ‌ర్‌.. DISNEY PLUS, HOTSTAR స‌బ్‌స్క్రిప్ష‌న్ ఏడాది పాటు ఫ్రీ

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌ను
ప్ర‌వేశ‌పెట్టింది. 1 ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ VIP స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను
ఉచితంగా అంద‌జేస్తున్న‌ట్లు తెలిపింది. అందుకుగాను క‌స్ట‌మ‌ర్లు ముందుగా రూ.401
ప్లాన్‌తో రీచార్జి చేసుకోవాలి. దీంతో 1 ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ
స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా ల‌భిస్తుంది. 

ఇక ఈ ప్లాన్‌లో 90 జీబీ డేటా వ‌స్తుంది. దీన్ని నిత్యం 3జీబీ చొప్పున 28 రోజుల
పాటు వాడుకోవ‌చ్చు. అలాగే మ‌రో 6జీబీ డేటా ఉచితంగా ల‌భిస్తుంది. దీంతోపాటు 28
రోజుల వ‌ర‌కు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా ల‌భిస్తాయి. అలాగే జియో టు జియో
అన్‌లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి. జియో టు నాన్ జియో 1000 ఉచిత నిమిషాలు
ల‌భిస్తాయి. ఇక 28 రోజులు ముగిశాక క‌స్ట‌మ‌ర్లు ఏ ప్లాన్‌ను అయినా రీచార్జి
చేసుకోవ‌చ్చు, కాక‌పోతే 1 ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ
స‌బ్‌స్క్రిప్ష‌న్ ను ఉచితంగా పొందాలంటే మాత్రం నెల నెలా 12 నెల‌ల పాటు ఏదైనా ఒక
ప్లాన్‌ను యాక్టివ్‌గా ఉంచాలి. దీంతో 1 ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ
స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా ల‌భిస్తుంది.

కాగా హాట్‌స్టార్ యాప్‌లో 1 ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకుంటే దానికే రూ.399 అవుతుంది. ఈ క్ర‌మంలో జియో కేవ‌లం మ‌రో రూ.2 అద‌నంగా వేసి రూ.401కు ఆ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఉచితంగా అందించ‌డంతోపాటు మొద‌టి నెల రోజుల వ‌ర‌కు ఉచిత రీచార్జి ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఇక రూ.401 ప్లాన్‌ను జియో కొత్త‌గా లాంచ్ చేయ‌గా.. రూ.2599 పేరిట ఇదే త‌ర‌హాలో మ‌రో వార్షిక ప్లాన్‌ను కూడా లాంచ్ చేసింది. అందులో క‌స్ట‌మ‌ర్ల‌కు 740 జీబీ డేటా వ‌స్తుంది. దాన్ని 365 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా చొప్పున ఉప‌యోగించుకోవ‌చ్చు. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా ల‌భిస్తాయి. మ‌రో 10 జీబీ ఉచిత డేటా అద‌నంగా వ‌స్తుంది. జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్, జియో టు నాన్ జియో 12వేల ఉచిత నిమిషాలు వ‌స్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ ఏడాది కాగా.. దీంతో 1 ఏడాది పాటు డిస్నీ + హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. ఈ ప్లాన్‌ను కూడా జియో కొత్త‌గా లాంచ్ చేసింది.

Flash...   మీ ఫోన్ లు ఉన్న ఈ పది App లు చైనావి అని మీకు తెలుసా

>రూ.612 ప్యాక్ ద్వారా 72 జీబీ డేటా వ‌స్తుంది. జియో టు నాన్ జియో 6వేల ఉచిత నిమిషాలు వ‌స్తాయి. ఈ ప్యాక్ ప్ర‌స్తుతం యూజ‌ర్ వాడుతున్న ప్లాన్ వాలిడిటీనే క‌లిగి ఉంటుంది.

>రూ.1004 ప్యాక్‌తో 200 జీబీ డేటా వ‌స్తుంది. దీని వాలిడిటీ 120 రోజులు. ఇందులో ఎలాంటి ఉచిత నిమిషాలు అందివ్వ‌డం లేదు.

>రూ.1206 ప్యాక్‌లో 240 జీబీ డేటా వ‌స్తుంది. దీని వాలిడిటీ 180 రోజులు. ఇందులోనూ ఉచిత నిమిషాల‌ను ఇవ్వ‌డం లేదు.

>రూ.1208 ప్యాక్‌లో 240 జీబీ డేటా వ‌స్తుంది. దీని వాలిడిటీ 240 రోజులు. ఇందులోనూ ఉచిత నిమిషాల‌ను ఇవ్వ‌డం లేదు.