తెలంగాణలో కరోనా విశ్వరూపం.. ఒకేరోజు 206 కేసులు, 10 మంది మృతి.

 

తెలంగాణలో శనివారం ఒక్కరోజులో భారీగా కరోనా కేసులను గుర్తించారు. శనివారం మొత్తం
206 కరోనా కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3496కు చేరుకుంది. వీటిలో, మొత్తం లోకల్
కేసులు మాత్రం 3048 అని హెల్త్ బులెటిన్‌లో వివరించారు. అయితే, శనివారం
అత్యధికంగా పది మంది కరోనాతో చనిపోయినట్లుగా పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకూ
కరోనా మృతుల సంఖ్య 123కి చేరుకుంది.

శనివారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ అధికంగానే కొత్తగా కేసులు
నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 152 కేసులు నమోదు కాగా,
రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్‌లో 18, నిర్మల్‌లో 5, యాదాద్రిలో 5,
మహబూబ్‌నగర్‌లో 4, జగిత్యాల, నాగర్ కర్నూల్‌లో రెండు చొప్పున, వికారాబాద్,
మహబూబాబాద్‌, జనగామ, గద్వాల, నల్గొండ, భద్రాద్రి, కరీంనగర్, మంచిర్యాలలో
ఒక్కొక్కటి చొప్పున కొత్త కేసులను గుర్తించారు. ఇక నాన్ లోకల్ కేసుల్లో శనివారం
సున్నా కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
Flash...   world blood donor day -2021 : రక్తదానం చేయడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా..?