ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా నుంచి బ‌య‌ట ప‌డ్డ దేశాలు ఇవే

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల‌ను కరోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌టికీ భ‌య‌పెడుతోంది.
ఎన్నో దేశాల్లో ల‌క్ష‌లాది మంది ఈ వైర‌స్ కార‌ణంగా చ‌నిపోయారు. మ‌న దేశంలోనూ
ప్ర‌స్తుతం క‌రోనా తాకిడి ఎక్కువ‌వుతోంది. అయితే ప‌లు దేశాలు మాత్రం క‌రోనా
నుంచి బ‌య‌ట ప‌డిన‌ట్లు వెల్ల‌డించాయి. త‌మ‌ను తాము క‌రోనా ఫ్రీ కంట్రీలుగా ఆయా
దేశాలు ప్ర‌క‌టించుకున్నాయి. ఆ దేశాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.
మాంటెనెగ్రో
మే 24వ తేదీనే ఈ దేశం క‌రోనా ఫ్రీ కంట్రీగా ఆవిర్భవించింది. అక్క‌డ 324 మందికి
క‌రోనా సోకింది. 9 మ‌ర‌ణాలు చోటు చేసుకున్నాయి.
సీషెల్స్
ఈ ఐల్యాండ్‌లో ప్ర‌స్తుతం క‌రోనా లేదు. మొత్తం 11 మందికి క‌రోనా సోక‌గా అంద‌రూ
కోలుకున్నారు. ఎలాంటి మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు.
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్
మే 19న ఈ దేశం క‌రోనా ఫ్రీ దేశంగా మారింది. అక్క‌డ మొత్తం 15 కేసులు న‌మోదు
కాగా అంద‌రూ రిక‌వ‌రీ అయ్యారు.
టిమోర్‌-లెస్టె
మే 15వ తేదీన ఈ ఐల్యాడ్ కరోనా ఫ్రీ కంట్రీగా మారింది. ఇక్క‌డ 24 మందికి వైర‌స్
వ్యాపించ‌గా అంద‌రూ కోలుకున్నారు. ఎలాంటి మ‌ర‌ణాలు చోటు చేసుకోలేదు.
ప‌పువా న్యూ గినియా
మే 4వ తేదీనే ఈ దేశం క‌రోనా నుంచి బ‌య‌ట ప‌డింది. అక్క‌డ మొత్తం 24 కేసులు
న‌మోదు కాగా అంద‌రూ కోలుకున్నారు. ఎవ‌రూ చ‌నిపోలేదు.
 న్యూజిలాండ్
జూన్ 8వ తేదీన న్యూజిలాండ్ తాము క‌రోనా ఫ్రీ దేశంగా అవ‌త‌రించామ‌ని తెలిపింది.
అక్క‌డ ప్ర‌స్తుతం యాక్టివ్ క‌రోనా కేసులు ఏవీ లేవు. అక్క‌డ 1500 మందికి క‌రోనా
సోక‌గా 22 మంది చ‌నిపోయారు.
టాంజానియా
టాంజానియాలో క‌రోనా కేసులు 509 న‌మోదు కాగా.. అక్క‌డ వైర‌స్ వ్యాప్తి స‌డెన్‌గా
ఆగిపోయింది. అయితే తాము దేవున్ని ప్రార్థించ‌డం వ‌ల్ల ఆ కేసులు త‌గ్గాయ‌ని..
ఇప్పుడు త‌మ ద‌గ్గ‌ర క‌రోనా లేద‌ని ఆ దేశ ప్రెసిడెంట్ జాన్ మ‌గుఫులి
ప్ర‌క‌టించారు. అయితే ఇరుగు పొరుగున ఉన్న దేశాలు మాత్రం ఆయ‌న ప్ర‌క‌ట‌న‌పై
అనుమానం వ్య‌క్తం చేస్తున్నాయి.
Flash...   REDUCED CARONA CASES IN AP ON 23.05.2020
వాటిక‌న్
వాటిక‌న్‌లో క‌రోనా సోకిన 12 మంది పేషెంట్లు రిక‌వ‌రీ అయ్యారు. అక్క‌డ ఎలాంటి
క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు. దీంతో ఆ దేశాన్ని క‌రోనా ఫ్రీ కంట్రీగా
ప్ర‌క‌టించారు.
ఫిజి
ఫిజి కూడా క‌రోనా ఫ్రీ దేశంగా అవ‌త‌రించింది. అక్క‌డ మొత్తం 18 మందికి క‌రోనా
సోక‌గా అంద‌రూ రిక‌వ‌రీ అయ్యారు. అక్క‌డ ఇప్పుడు క‌రోనా కేసులు లేవు.