బదిలీలకు ముందే.. సర్దుబాటు

Guntur: జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 3279 ఉన్నాయి.
ప్రతి పాఠశాల నుంచి సంబంధిత నమూనాలో వివరాలను పంపాలని స్పష్టం చేసింది. మూడేళ్ల
క్రితం పని సర్దుబాటు కోసం రేషనలైజేషన్‌ నిర్వహణకు గత ప్రభత్వం చర్యలు తీసుకుంది.
కానీ ఆచరణకు వచ్చేసరికి అది అమలు చేయలేదు. దీంతో చాలా పాఠశాలల్లో పిల్లల సంఖ్య
కన్నా ఉపాధ్యాయులే ఎక్కువగా ఉన్నారని, మరికొన్నిచోట్ల పిల్లలకు సరిపడా టీచర్లు
లేక ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొంటున్నాయి. వీటన్నింటిని అధిగమించడానికి తక్షణం
రేషనలైజేషన్‌ చేపట్టడమే ఏకైక పరిష్కార మార్గమని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది.
దీంతో జిల్లాలో ఈ దిశగా కసరత్తు జరుగుతోంది.
డైస్‌తో సంబంధం లేకుండా…
ఏ పాఠశాలలో ఎంత మంది పిల్లలు, ఎందరు టీచర్లు ఉన్నారనేది ప్రభుత్వం వద్ద ఇప్పటికే
ఆన్‌లైన్‌లో సమాచారం అందుబాటులో ఉంది. ఇది అంత పక్కాగా ఉండకపోవచ్చని, దీనిలో కొంత
బోగస్‌ హాజరు ఉండొచ్చన్న అనుమానంతో ఫిజికల్‌గా ఎంఈవో, హెచ్‌ఎం, డీవైఈఓల నుంచి
వేర్వేరుగా ఈ వివరాలు సేకరించాలని నిర్ణయించింది. దీని వల్ల ఎవరికి వారు
కచ్చితమైన సమాచారం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అనేక పాఠశాలల్లో పిల్లల ప్రవేశాలు
వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ఉన్నాయి. కానీ ఉపాధ్యాయులు మాత్రం ఇద్దరు,
ముగ్గురికి తక్కువ కాకుండా ఉన్నారు. మరికొన్ని చోట్ల పిల్లలకు సరిపడా టీచర్లు లేక
ఉపాధ్యాయుల కొరత ఎదుర్కొంటున్నాయి. ఈ అసమానతలను నివారించి ప్రతి ఉపాధ్యాయుడికి
పనిభారం(వర్క్‌లోడ్‌) చూపించటానికి రేషనలైజేషన్‌కు శ్రీకారం చుట్టనున్నారు.
గతంలోనే సుమారు 550 పాఠశాలల్లో పిల్లల కన్నా టీచర్లు అధికంగా ఉన్నారని
గుర్తించారు. ఈ క్రమంలోనే పిల్లల ప్రవేశాలు తక్కువ ఉన్న పాఠశాలలను సమీపంలో
పిల్లలు ఎక్కువ ఉన్న బడుల్లో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనికి ఆ
ప్రాంత ప్రజాప్రతినిధులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Flash...   రష్యన్ వ్యాక్సిన్ పని చేస్తే మనం అదృష్టవంతులమే ! సీసీఎంబీ