విశాఖనే పరిపాలన రాజధాని.. వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం

బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్ర శాసన సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, దేవాదాయ చట్టంలో రెండు సవరణ బిల్లులకు శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. వీటితోపాటు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణల బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, వ్యాట్ సవరణ బిల్లు, 2020 ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇదిలాఉండగా.. దేవాదాయ చట్టంలో సవరణలకు సంబంధించి ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చొరవతోనే టీటీడీలో సన్నిధి గొల్లలకు వారసత్వ హక్కు లభించిందని అన్నారు. చట్టంలో సన్నిధి యాదవులని మార్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

పరిపాలన వికేంద్రీకరణ అత్యంత కీలకమైన అంశంగా ప్రభుత్వం
భావిస్తోందని గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన
మూడు రాజధానులు ఏర్పాటు శాసన ప్రక్రియలో ఉందని స్పష్టం చేశారు. శాసన రాజధానిగా
అమరావతి, కార్యానిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని
మరోసారి గుర్తుచేశారు. శాసనసభ, మండలి బడ్జెట్‌ సమావేశాలను పురస్కరించుకుని ఉభయ
సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నర్‌ ఈ అంశాన్నిపునరుద్ఘాటించారు. గత
అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పరిపాలన వికేంద్రీకరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌
జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళిలు రచించిన విషయం తెలిసిందే. 

దీనిలో భాగంగానే ఇప్పటికే అభివృద్ధిలో దూసుకుపోతున్న విశాఖను పరిపాలన రాజధానిగా
ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వెనుకబడిన రాయలసీమకు పూర్వవైభవం
తీసుకువచ్చేలా, కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసి న్యాయ రాజధానిగా గుర్తించాలని
సంకల్పించింది. ప్రభుత్వ నిర్ణయానికి ప్రతిపక్ష టీడీపీ నిత్యం అభ్యంతరం వ్యక్తం
చూస్తూ కోర్టులో కేసులు వేస్తున్నా, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మూడు రాజధానులకే
ముఖ్యమంత్రి జగన్‌ కట్టుబడి ఉన్నారు. ఈ మేరకు సంబంధిత బిల్లుకు రాష్ట్ర శాసనసభ
సైతం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

Flash...   Appeals received on utilizing spouse points in Transfers