15 నుంచి మళ్లీ పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అంటూ వస్తున్న పుకార్లు … క్లారిటీ ఇచ్చిన కేంద్రం

15 నుంచి మళ్లీ పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అంటూ వస్తున్న పుకార్లు
నమ్మకండి….. క్లారిటీ ఇచ్చిన కేంద్రం.

కరోనా విస్తరించకుండా మొదట్లో లాక్‌డౌన్‌ విధించిన కేంద్రం… ఆ తర్వాత క్రమంగా
సడలింపులు ఇస్తూ వస్తోంది. ఇదే సమయంలో కరోనా కేసులు రోజురోజుకు భారీఎత్తున
పెరిగిపోతున్నాయి… ఇక, కరోనా వ్యాప్తి విస్తృతమవుతున్న వేళ మరోసారి లాక్‌డౌన్‌
విధిస్తారంటూ సోషల్‌ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. న్యూస్ దొరికితే చాలు
వైరల్ చేసే నెటిజన్లు… మళ్లీ లాక్ డౌన్ అంటూ సాగుతున్న ప్రచారాన్ని షికారు
చేయించారు.. అయితే, అవి గాలి కబుర్లేనని కొట్టిపారేసింది కేంద్ర ప్రభుత్వం.
అలాంటి ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేసింది. 
ఈ నెల 15 నుంచి మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తారంటూ కొన్ని వార్తలు
పుట్టుకొచ్చాయి.. వీటిపై కేంద్రం స్పందించింది. ఈ వార్తలు పూర్తిగా సత్యదూరమని
స్పష్టం చేసింది. దీనికి సంబంధించి.. పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ టీమ్‌ ట్వీట్‌
చేసింది.  కాగా, దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా
పెరుగుతున్న సంగతి తెలిసిందే. మరో వైపు రికవరీ రేటు కూడా పెరుగుతోంది. 
దీంతో మళ్లీ పుర్తిస్థాయిలో లాక్ డౌన్ లేదని స్పష్టం చేస్తోంది కేంద్రం.
Flash...   దగ్గు మందని చెప్పి కరోనా మాత్రలు తెచ్చారట! Baba Ramdev