AP ని వణికిస్తున్న కరోనా.. ఒక్కరోజే 465 కేసులు.. 96కు పెరిగిన మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం రాష్ట్ర
వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం విడుదల బులెటిన్ విడుదల చేయగా,
మొత్తం 461 కేసులు నమోదయ్యాయి. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 376
మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 70 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు
19 మంది ఉన్నారు.
రాష్ట్రానికి సంబంధించిన వివరాలను గమనిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో
17,609 మంది శాంపిల్స్ పరీక్షించగా 376 మంది కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలారు. 82
మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 6,134 కేసులు
నమోదు కాగా, 3,065 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ కోవిడ్‌
ఆస్పత్రుల్లో 3,069 మంది చికిత్స పొందుతున్నారు.
అలాగే కరోనా వైరస్ కారణంగా గడిచిన 24 గంటల్లో నలుగురు మరణించారు. వీరిలో కృష్ణా
జిల్లాలో ఇద్దరు, ప్రకాశంలో ఒకరు, శ్రీకాకుళం ఒకరు మరణించారు. దీంతో
రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 96కు పెరిగింది. అలాగే పొరుగు
దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం
7,865 కేసులు నమోదయ్యాయి
Flash...   విద్యా సంవత్సరం ఉంటుందా?ఉండదా? - పవన్