AP లో ప్రైవేట్ ల్యాబ్స్‌లోనూ CARONA TEAT.. Rs.2,900

రోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో దేశవ్యాప్తంగా మెరుగైన స్థానంలో ఉన్న
ఆంధ్రప్రదేశ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇకపై ప్రైవేటు ల్యాబుల్లో సైతం
కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలకు అనుమతిస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం శుక్రవారం
ప్రకటించింది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్
లాబొరేటరీస్ (ఎన్‌ఏబీటీసీఎల్)‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌
(ఐసీఎంఆర్‌) గుర్తించిన ల్యాబుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయొచ్చునని స్పష్టం
చేసింది.
ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వస్తున్న వారిలో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో
రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తక్కువ ఖర్చుతోనే కరోనా టెస్టు
జరిగేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ప్రభుత్వం పంపిన నమూనాలకు
రూ.2,400 వసూలు చేయాలని.. వ్యక్తిగతంగా సంప్రదిస్తే రూ.2,900 తీసుకోవాల్సిందిగా
సూచించింది.
కాగా, శుక్రవారం ఉదయం నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 5,22,093 కోవిడ్‌ 19 పరీక్షలు చేసిన
విషయం తెలిసిందే. రాష్ట్రానికి సంబంధించిన కరోనా వైరస్ కేసులు 4,402 నమోదు కాగా,
విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసులు
5,636కు చేరాయి. మరో 59మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్
కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1723కు చేరింది.
Flash...   హోమ్ లోన్ తీసుకున్నారా? ఇలా చేస్తే మీకు 3 రూ.లక్షలు ఆదా!