AP: 253 కేసులు, ఇద్దరు మృతి (14.6.20)


 ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 15,633
నమూనాలు పరీక్షించగా 253 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల
సంఖ్య 6152 కు చేరింది. ఇందులో 204 ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివి కాగా, 1107
విదేశాల నుంచి వచ్చిన కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మీడియా బులెటిన్‌లో
పేర్కొంది. 

తాజాగా వైరస్‌ బారినపడ్డవారిలో తూర్పుగోదావరిలో ఒకరు, కర్నూలులో మరొకరు మృతి
చెందడంతో  కోవిడ్‌ మృతుల సంఖ్య 84 కు చేరింది
. కరోనా నుంచి కోలుకుని ఆదివారం 82 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.
దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 2723 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2034
యాక్టివ్ కేసులున్నాయి. 
కరోనా: సగం కంటే ఎక్కువ కోలుకున్నారు:

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌
కేసలు సంఖ్య పెరుగుతోంది. కేసుల పెరుగుదలతో పాటు వైరస్‌ సోకి చికిత్స అనంతరం
ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యేవారి శాతం కూడా పెరుగుతోంది. తాజాగా ఆదివారం
కరోనా వైరస్‌ రికవరీ రేటు 50 శాతం దాటిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడిచిన
24 గంటల్లో అత్యధికంగా 11,929 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
ఇక ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 50.60 శాతం మంది కోలుకున్నారని పేర్కొంది. దీంతో
దేశంలో వైరస్‌ సోకిన వారిలో సగం కంటే ఎక్కువ మంది కరోనా నుంచి కోలుకున్నట్లు
తెలిపింది.
గత రెండు రోజులుగా రోజుకు 11 వేల చొప్పున కరోనా పాజిటివ్‌ కేసులు
నమోదైనప్పటికీ రికవరీ రేటు కూడా అదే స్థాయిలో రోజురోజుకు పెరుగుతోంది
. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,49,348 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1,62,378 మంది
కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక 9,195 మంది కరోనా వైరస్‌
బారినపడి మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. 
Flash...   Charging Bulbs: కరెంట్‌ లేకపోయినా పనిచేసే బల్బ్స్‌.. తక్కువ ధరలోనే..