ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీకి రంగం సిద్ధమయింది. ఈ మేరకు
బదిలీల జాబితాను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. నాలుగు జిల్లాల ఎస్పీలకు
స్థానచలనం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయవాడ సీపీగా సేవలు అందిస్తున్న
ద్వారకా తిరుమలరావును రైల్వేస్ డీజీపీగా బదిలీ చేసే అవకాశం ఉంది. ఆయన స్థానంలో
విజయవాడ సీపీగా బీ శ్రీనివాసులు నియమితులు కానున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఒకటి
రెండు రోజుల్లో అధికారిక జీవో విడుదలయ్యే అవకాశం ఉంది.

ప్రభుత్వం సిద్ధం చేసిన జాబితా ప్రకారం..
- ఆర్గనైజేషన్ అడిషనల్ డీజీపీగా ఎన్ బాలసుబ్రహ్మణ్యం
- ఎస్ఈబీ డైరెక్టర్‌గా పీహెచ్డీ రామక్రిష్ణ
- రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీగా క్రిపానంద త్రిపాటి ఉజేలా
- గుంటూరు అర్బన్ ఎస్పీగా అమ్మిరెడ్డి
- శ్రీకాకుళం ఎస్పీగా అమిత్ బర్దార్
- అడ్మిన్ ఏఐజీగా బిల్లా ఉదయ్ భాస్కర్
- విశాఖ డీసీపీ1గా ఐశ్వర్య రస్తోగి
- విశాఖ డీసీపీ 1 పోలీస్ హెడ్ క్వార్టర్‌కి రిపోర్ట్
- ఎస్ఐబీ ఎస్పీగా అట్టాడ బాబూజీ
- విశాఖ రూరల్ ఎస్పీగా బి క్రిష్ణా రావు
- గుంటూరు రూరల్ ఎస్పీగా విశాల్ గున్నీ
- విజయవాడ రైల్వేస్ ఎస్పీగా సీహెచ్ విజయరామారావు
- సీఐడీ ఎస్పీగా గ్రేవల్ నవదీప్ సింగ్
- మంగళగిరి ఏపీఎస్పీ కమాండెంట్ గా ఎం దీపిక
-
పశ్చిమ గోదావరి ఎస్పీగా కె నారాయణ నాయక్.. బదిలీ అయ్యే అవకాశం
ఉంది.