BREAKING NEWS: టీటీడీకి కరోనా సెగ… రెండు రోజులు ఆలయం మూసివేత

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ దేవాలయాలైన తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి
ఆలయాలని భక్తులు పోటెత్తుతున్నారు.  అయితే, ఆలయంలోకి  భక్తులను
లిమిటెడ్ గా అనుమతిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, టీటీడీ అనుబంధ దేవాలయాల్లో
ఒకటైన తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో పనిచేస్తున్న ఓ శానిటేషన్ ఇన్స్పెక్టర్ కి
కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.  
రెగ్యులర్ చెకప్ లో భాగంగా ఇన్స్పెక్టర్ హాస్పిటల్ కు వెళ్లి చెకప్ చేయించుకోగా,
కరోనా లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.  పూర్తి స్తాయి టెస్టులు
నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.  దీంతో తిరుపతి గోవిందరాజ
స్వామి ఆలయాన్ని రెండు రోజులపాటు మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
ఆలయాన్ని పూర్తి స్తాయిలో శానిటేషన్ చేసిన తరువాత తిరిగి ఆదివారం నుంచి
తెరుస్తామని  టీటీడీ తెలిపింది. ఇక కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎవరెవరితో
కలిసి ఉన్నారు, ఎవరితో మాట్లాడారు అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం
చేస్తున్నది.Source: Ntv news
Flash...   Register for Covid Swab Collection Appointment