BREAKING: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదా

హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ తెలంగాణ
ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పదో తరగతి పరీక్షలపై విచారణ జరిపిన హైకోర్టు జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లాలు
మినహా మిగిలిన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చు అంటూ తీర్పును ఇచ్చిన
విషయం తెలిసిందే.

అయితే ఇది సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి
పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిన
తరువాతే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

హైకోర్టు తీర్పుపై సంతృప్తి చెందని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల వాయిదాకే మొగ్గు
చూపింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నందున విద్యార్థులు ఇబ్బందులు
పడకూదన్న ఉద్దేశంతో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Flash...   SSC PUBLIC EXAM MARCH 2020 RESULTS AND SHORT MEMOS