CARONA విరుగుడుకు BCG , పోలియో టీకాలు

వాషింగ్టన్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ నుంచి రక్షణ కల్పించడంలో క్షయ, పోలియో
వ్యాక్సిన్లను ఉపయోగించే అవకాశాన్ని అమెరికా పరిశోధకులు పరిశీలిస్తున్నారు. కరోనా
వైరస్‌ను కట్టడి చేయడంతో ట్యుబర్‌కులోసిస్‌ టీకా పనిచేస్తున్నదీ లేనిదీ
తెలుసుకునేందుకు అమెరికాలో పరీక్షలు జరుగుతున్నాయని వాషింగ్టన్‌ పోస్ట్‌ ఒక
కథనంలో పేర్కొంది. ‘కోవిడ్‌–19పై పోరాడేందుకు ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న ఏకైక టీకా
బీసీజీ (బాసిల్లస్‌ కాల్మెట్టే గ్యురిన్‌)నే’అని టెక్సాస్‌ ఏ అండ్‌ ఎం హెల్త్‌
సైన్స్‌ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్‌ జెఫ్రీ డి సిరిల్లో అన్నారు.
అమెరికా ప్రభుత్వ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ గతంలో ఈ టీకాను
సురక్షితంగా ప్రయోగించిన దాఖలాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. కోవిడ్‌–19
నిలువరించేందుకు పోలియో వ్యాక్సిన్‌ను కూడా వాడొచ్చని మరికొందరు శాస్త్రవేత్తలు
అంటున్నారు. పాక్‌ సంతతికి చెందిన అమెరికన్‌ ప్రొఫెసర్‌ అజ్రా రజా మాట్లాడుతూ..
బీసీజీ టీకా అనేక రకాల వైరస్‌లతోపాటు బ్లాడర్‌ క్యాన్సర్‌ను కూడా అడ్డుకున్నట్లు
రుజువైందన్నారు. ‘బీసీజీ, పోలియోలపై పోరాడేందుకు  గతంలో కోట్ల మందికి ఈ
టీకాలను ఇచ్చాం. వీటితో బాధితులకు రిస్క్‌ చాలా తక్కువ. ఇవి శరీరంలో సహజ వ్యాధి
నిరోధక శక్తిని పెంచుతాయి. కరోనా సహా పలు వైరస్‌లను నియంత్రించే శక్తి వీటికి
ఉంది’అని వీరు తెలిపారని వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది.
Flash...   Breakfast in schools