CM లతో మళ్లీ ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌.

సీఎంలతో మళ్లీ ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌.. ఈసారి రెండు గ్రూపులుగా..

ప్రధాని మోదీ మళ్లీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్
నిర్వహించనున్నారు. దేశంలో చేయిదాటి పోతున్న కరోనా కేసులు, వాటి నియంత్రణ, లాక్‌
డౌన్‌ ఎత్తివేత తర్వాత ఎదురవుతున్న పరిస్థితులు వంటి అంశాలపై మోదీ సీఎంలతో
చర్చించనున్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ ఈ నెల 16, 17 తేదీల్లో ఈ సమావేశం ఉండే అవకాశం ఉందని అధికార
వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ సారి దేశంలోని అందరూ ముఖ్యమంత్రులను రెండు
టీమ్‌లుగా విభజించి ప్రధాని మోదీ వేర్వేరుగా వీడియో కాన్ఫరెన్స్
నిర్వహించనున్నారు. ఒక్కో గ్రూప్‌తో ఒక్కోరోజు కరోనా కట్టడి చర్చలు జరుపుతారని
సమాచారం. 16న నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ ముఖ్యమంత్రి, 17వ తేదీ జరిగే
వీసీలో తెలంగాణ సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.

Flash...   OTT మార్కెట్ సినీ పరిశ్రమ తీరు మార్చేసిందా ?