COVID – 19: ఉద్యోగులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

NEW-GUIDE

దేశవ్యాప్తంగా కొవిడ్-19 విజృంభిస్తుండటం, పలు కార్యాలయాల్లోనూ అలజడి రేపుతున్న
నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగులకు
సర్కార్‌ మరికొన్ని సూచనలు విడుదల చేసింది. మళ్లీ వర్క్‌ ఫ్రం హోం
ప్రారంభిస్తున్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంగళవారం (జూన్ 9) తెలిపింది.
పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారిని మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతినించాలని, మిగతా వారు
ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది.

కంటైన్‌మెంట్ జోన్ పరిధిలో ఉన్న ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని కేంద్రం
చెప్పింది. జ్వరం, దగ్గు లక్షణాలు ఉంటే ఆఫీసులకు రావద్దని మార్గదర్శకాల్లో
పేర్కొంది. ఒక్కో విభాగంలో రోస్టర్ పద్ధతిన 20 మంది సిబ్బంది లేదా అధికారులకు
మాత్రమే అనుమతి ఉంటుందని కేంద్రం తెలిపింది. ఇందుకు అనుగుణంగా వారిపని వేళల్లో
మార్పులు చేయాలని.. సిబ్బంది విడతల వారీగా హాజరయ్యేలా ఏర్పాటు చేయాలని
సూచించింది. మిగిలిన వారు ఇంటినుంచే పనిచేయాలి. సెక్రటరీ స్థాయి అధికారులు రోజు
విడిచి రోజు హాజరు కావాలని వెల్లడించింది.

ఉద్యోగులు ఎదురెదురుగా కూర్చోవద్దని, ఇంటర్ కాంలోనే మాట్లాడుకోవాలని తెలిపింది.
మాస్కు, ఫేస్ షీల్డ్ తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది. మాస్కు పెట్టుకోకుంటే
క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలు
నిర్వహించాలని సూచించింది. కామన్ ఏరియాలో ప్రతి గంటకోసారి శుభ్రం చేయాలని,
కంప్యూటర్ కీబోర్డులు ఎవరివి వారే శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని కేంద్ర
ప్రభుత్వ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

ఉద్యోగులు ముఖాన్ని కప్పి ఉంచే మాస్కులు లాంటి వాటిని పూర్తి కాలం ధరించాలి.
వాడేసిన మాస్కులు, గ్లౌజులను వెంటనే పడేయాలి. విధుల్లో భాగంగా ముఖాముఖి
సమావేశాలు, చర్చలను సాధ్యమైనంత వరకు నిరోధించాలి. ఇంటర్‌కామ్‌, ఫోన్లు, వీడియో
సమావేశాల ద్వారా కార్యకలాపాలు కొనసాగించాలని తెలిపారు.

Flash...   ఏపీలో కరోనా పంజా: 24 గంటల్లో 210.. కాంటాక్ట్ కేసుల టెన్షన్