Flipkart: 4 కెమెరాల 5G స్మార్ట్ ఫోన్… ఊహించని డిస్కౌంట్

వరల్డ్ ఫేమస్ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ iQOO నుంచి 5 జి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి
వచ్చింది. iQOO3 మార్కెట్లోనే అతి తక్కువ ధరకు ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ ఫోన్ పై
కంపెనీ భారీగా డిస్కౌంట్ ప్రకటించించింది. దీంతో ఫ్లిప్ కార్ట్ లో దొరికే ఈ ఆఫర్
కోసం మొబైల్ ప్రియులు తెగ వెతుకుతున్నారు.
5G ఫీచర్స్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, వరల్డ్ ఫేమస్ స్మార్ట్‌ఫోన్‌
బ్రాండ్ iQOO నుంచి 5 జి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. iQOO3
మార్కెట్లోనే అతి తక్కువ ధరకు ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ ఫోన్‌ను కంపెనీ ప్రారంభ ధర
రూ .34,990 కు లాంచ్ చేసింది. కానీ ఆఫర్ కింద, దీనికి భారీ తగ్గింపు ఇస్తున్నారు.
డిస్కౌంట్ పూర్తి వివరాలు తెలుసుకుందాం … ఈ ఫోన్ 8 జిబి + 256 జిబి వేరియంట్ ధర
రూ .37,990 గా నిర్ణయించారు. అయితే 12 జిబి + 256 జిబి (5 జి) వేరియంట్ ధర రూ.
44,990కే లభిస్తుంది.
వినియోగదారులు ఈ ఫోన్ కొనుగోలుపై 3 వేల రూపాయల తక్షణ క్యాష్‌బ్యాక్ పొందుతారు.
ఐసిఐసిఐ క్రెడిట్ / డెబిట్ కార్డు ద్వారా ఈ ఆఫర్ పొందగలుగుతారు. ఇక ఈ ఫోన్ EMI
లావాదేవీలో కూడా అందుబాటులో ఉంది. No cost EMI సైతం అందుబాటులో ఉంది.
అంతేకాదు ఈ ఫోన్‌ కొనుగోలు చేస్తే జియో అందిస్తున్న 12 వేల రూపాయల తక్షణ
ప్రయోజనం పొందవచ్చు
.
IQOO3 డిజైన్ అదుర్స్…
IQOO3 ఫోన్‌ టొరంటో బ్లాక్, క్వాంటం సిల్వర్ రంగులలో లభిస్తోంది. 5G సపోర్ట్ తో
పాటు 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డి + రిజల్యూషన్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఫోన్
డిస్ ప్లే దిగువన ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. దీంతో వినియోగదారులు 0.31
సెకన్లలో ఫోన్‌ను అన్‌లాక్ చేయగలరు. ఇది కాకుండా, ఇందులో పంచ్ హోల్ కెమెరా పైకి
కనిపిస్తుంది. సంస్థ తన స్క్రీన్‌కు ‘పోలార్ వ్యూ డిస్ ప్లే’ అని పేరు పెట్టింది.
Flash...   Awarding previous station points to the teachers effected in rationalization is not feasible
ఫోన్‌లో 4 కెమెరాలు ఉన్నాయి
క్వాడ్ కెమెరా సెటప్ ఫోన్‌లో ఇవ్వబడింది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా,
13 మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ స్నాపర్, 2
మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్‌కు 20 ఎక్స్ డిజిటల్ జూమ్ సపోర్ట్
ఉంది, సూపర్ నైట్ మోడ్ కూడా ఉంది. పవర్ కోసం, ఫోన్ 4,400 ఎమ్ఏహెచ్ శక్తికలిగిన
బ్యాటరీని కలిగి ఉంది, అంతేకాదు 55W సూపర్ ఫ్లాష్ ఛార్జర్‌ ఫోన్ తో పాటు
వస్తుంది. ఈ ఫోన్‌ను కేవలం 15 నిమిషాల్లో 50% ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.