Glen Mark మందు నిజంగా కరోనాకి మందేనా ?


గోదావరి లో కొట్టుకుపోయేవాడికి ఓ గడ్డిపోచ….కరోన కాలంలో పావిపిరవిర్ (నాలుగో
కృష్ణుడు పావిపిరవిర్)
Dr. Venu Gopala Reddy
 ఇండియాలో పెద్ద ఫార్మా కంపెనీ గ్లెన్మార్క్ భారత్ లో పూర్తి స్థాయి కరోనా
చికిత్సకు ఫావిపిరవీర్ ఔషధాన్ని వినియోగించబోతున్నట్టు ప్రకటించింది…దీని
గూర్చి తెలుసుకుందాం
1. ఇది ఒక అంటి వైరల్ డ్రగ్
2  జపాన్ లో influenza చికిత్స కోసం వినియోగించేవారు. హక్కులు fujifilm
కంపనివి
3. వైరస్ లు తమ అభివృద్ధి కోసం వినియోగించే RNA polymerase ని పనిచేయకుండా చేసి
వైరస్ సంఖ్య పెరగకుండా చేస్తుంది ఈ ఔషధం
4. భారత్ లో  150 (కేవలం)  మంది వ్యాధిగ్రస్తులకు  ఈ ఔషధాన్ని
ఇచ్చినపుడు చాలామంది వారం రోజుల్లో కోలుకున్నారు, వేరే ఔషధాలు వాడినవారు రెండు
వారాల్లో కోలుకున్నారు. అసలు మొత్తం ప్రయోగ వివరాలు వెల్లడించలేదు.
5. అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు మాత్రమే Drug Controler General of India
(DCGI) అనుమతించింది
6  దీనిని fabiflu పేరుతో ఇండియాలో విక్రయిస్తారు
7. దీని dosage 34 టాబ్లెట్స్, ధర 3500/-. మొత్తం డోస్ 14000 అని కొన్ని
కథనాలు
8. డాక్టర్స్ పర్యవేక్షణ లో మాత్రమే వినియోగించాలి
9. రష్యాలో ఈ ఔషధాన్ని 390 మంది వ్యాధిగ్రస్తులలో వినియోగించినప్పుడు 68% మందిలో
3 రోజుల్లో లక్షణాలు తగ్గాయి. వేరే ఔషధాలు వాడిన వారిలో 6 రోజులు పట్టింది
10. జపాన్ లో ఈ ఔషధాన్ని 2141 మంది పై ప్రయోగిస్తే రెండు వారాల్లో 88%
కోలుకున్నారు
11. త్వరలో ఈ ఔషధాన్ని యూమిఫినోవిర్ అనే మరో ఔషధం తో కలిపి పరిశోధించబోతున్నారు
12. కిడ్నీ, లివర్ వ్యాధిగ్రస్తులు,గర్భిణులు, బాలింతలు ఈ ఔషధం వినియోగించరాదు
13. పుట్టిల్లు జపాన్ లో అవిగాన్ పేరుతో ప్రయోగాలు చేస్తున్నారు. కానీ, అక్కడి
ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయి అనుమతులు ఇవ్వలేదు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా
వేసింది అనుమతులు
Flash...   GO MS 7,Dt:02.04.2020, RUPEES 1000/- TO BPL FAMILIES DURING LOCKDWON
14. డాక్టర్స్ చీటితో మెడికల్ షాపులో అమ్ముతారు..కానీ ముందుగా పేషెంట్ అంగీకార
పత్రం ఇవ్వాలి
15. ఈ ఔషధం మానవ రోగ నిరోధక వ్యవస్థని supress చేయడం వల్ల ఇతర సూక్ష్మజీవులు
వ్యాధిని కలిగించవచ్చు.ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి
ఇది చీకట్లో చిరుదివ్వె మాత్రమే….ఇంకా చాలా ప్రయోగాలు జరగాలి
కరోనాకు ఔషధం వచ్చేసింది,ఇక మెడికల్ షాప్ కి వెళ్లి కొనుక్కుని వేసుకోవడం అని
మాత్రం అనుకోవద్దు
ప్రపంచ వ్యాప్తంగా 54 దేశాల్లో ఈ ఔషధం పై ప్రయోగాలు చేస్తున్నారు. మొత్తం అంతటా
కలిపి కూడా పెద్ద సంఖ్యలో ప్రయోగాలు చేయలేదు.పుట్టినింట్లో జపాన్ లో మే లో అనుమతి
ఇస్తారు అనుకుంటే, ఈ ఔషధం మీద ఇంకా అనుమానాలున్నాయి, ఇంకా ప్రయోగాలు చేయాలి
అంటున్నారు. 2014 లోనే అనుమతి కోరిన అమెరికా ఇప్పటి వరకు అనుమతించలేదు 
ఇప్పటికే ఉన్న హైడ్రోక్లోరోక్విన్, remedesivir, ఇంటర్ఫెరాన్ మొదలైన వాటి
జాబితాలో ఇది మరో ఔషధం అంతే. రోగం ఉండగానే సర్దుకోవాలి అని ఫార్మా కంపెనీలు
ప్రయత్నిస్తున్నట్టుంది. అతిగా ఆశ పెట్టుకోవద్దు
వీటికి ప్రసార మాధ్యమాల హోరు జత కలసింది…..
కరోనాకు మందు రావాలి అని నేను కూడా కోరుకుంటున్నా….కానీ వచ్చేసింది అనే
స్టేట్మెంట్ correct కాదు
Dr. A. Venu Gopala Reddy, Microbiologist,& Principal, TS MODEL SCHOOL,
VEENAVANKA 9948106198.
please share this post to friends