HDFC బ్యాంకు కస్టమర్లకు శుభవార్త, వడ్డీ రేట్లు తగ్గింపు

ప్రయివేటురంగ బ్యాంకు దిగ్గజం HDFC తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. వడ్డీ
రేట్లను 20 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్ పైన
రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (RPLR)ను తగ్గించిందని, ఇది జూన్ 12వ తేదీ నుండి
అంటే ఈ రోజు నుండి అమలులోకి వస్తాయని తెలిపింది. కరోనా నేపథ్యంలో ఆర్బీఐ రెపో
రేటు తగ్గించిన నేపథ్యంలో వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. ఇప్పుడు
తగ్గించిన వడ్డీ రేట్లు హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్, గృహరుణేతర కస్టమర్లకు ప్రయోజనం
చేకూరుతుందని తెలిపింది.

వడ్డీ రేట్లు ఇలా..

 ఇప్పటికే ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్
బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయి.
ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ తగ్గించింది. HDFC నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు (MCLR)ను 5
బేసిస్ పాయింట్లు లేదా 0.05 శాతం తగ్గించింది. సవరణ తర్వాత ఓవర్ నైట్ MCLR రేటు
7.30 శాతానికి, ఒక నెల MCLR రేటు 7.35 శాతానికి, ఏడాది కాల MCLR 7.65 శాతానికి,
మూడేళ్ల MCLR 7.85 శాతానికి దిగి వచ్చినట్లు బ్యాంకు తెలిపింది. ప్రస్తుత శాలరైడ్
కస్టమర్లకు కొత్త రుణాలు 7.65 శాతం నుండి 7.95 శాతం మధ్య ఉంటాయని తెలిపింది.

ఎంత తగ్గుతుంది.

రుణగ్రహీతలు 20 సంవత్సరాల కాలపరిమితితో రూ.25 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే నెలవారీ
ఈఎంఐపై రూ.325 తగ్గుతుంది. 15 ఏళ్ల కాలపరిమితికి రూ.300 వరకు తగ్గుతుంది. బ్యాంకు
RPLRను తగ్గించిన తర్వాత 16.20 శాతం వద్ద ఉంది. మార్చి నెల నుండి RPLR 40 బేసిస్
పాయింట్లు తగ్గింది

Flash...   Sankranti Kites Festival: సంక్రాంతికే గాలిపటాలను ఎందుకు ఎగురవేస్తారు .. మీకు తెలుసా ?