NADU NEDU – RJDSE KAKINADA PROFORMA

మనబడి నాడు-నేడు.

మనబడి నాడు-నేడు కార్యక్రమానికి సంబంధించి ఎప్పటికప్పుడు పురోగతిని
సమీక్షించుటకు, మనబడి నాడు నేడు వెబ్ సైట్ లో వివిధ రిపోర్ట్స్ మనకు అందుబాటులో
ఉన్నాయి.


ఈ రిపోర్ట్స్ అత్యంత వివరంగా, జిల్లా స్థాయి నుంచి పాఠశాల స్థాయి వరకు
జరుగుతున్నటువంటి పనుల పురోగతిని సమీక్షించుటకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి.


అయితే ప్రతి పనిలోనూ పాఠశాల వారిగా, మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాల
వారీగా జరిగిన, జరుగుతున్న పనుల పురోగతిని విహంగ వీక్షణం చేయడానికి, జోనల్
స్థాయిలో ఒక క్విక్ రిపోర్ట్  v2.0 ప్రొఫార్మా రూపొందించడం జరిగింది.


ప్రతి పాఠశాల స్థాయిలో సమాచారం ఈ ప్రొఫార్మా లో నింపి, ఈ రిపోర్ట్ ఒక కాపీ తమ
దగ్గర ఉంచుకుని, ఒక కాపీని మండల విద్యాశాఖ అధికారులకు పంపవలసి ఉంది.


మండల విద్యాశాఖ అధికారులు మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల యొక్క సమాచారం
క్రోడీకరించి ఇదే ప్రొఫార్మా లో నింపి, ఈ రిపోర్ట్ ఒక కాపీ తమ దగ్గర ఉంచుకుని, ఒక
కాపీని నియోజకవర్గ స్థాయికి అందించవలసి ఉంది.


నియోజకవర్గ స్థాయి అధికారులు వారి యొక్క అన్ని మండలాల సమాచారము క్రోడీకరించి ఇదే
ప్రొఫార్మా లో నింపి, ఈ రిపోర్ట్ ఒక కాపీ తమ దగ్గర ఉంచుకుని ఒక కాపీని
జిల్లాస్థాయికి పంపవలెను.


జిల్లా స్థాయిలో అన్ని నియోజకవర్గాల సమాచారం క్రోడీకరించి ఈ ప్రొఫార్మా లో నింపి,
ఈ రిపోర్ట్ ఒక కాపీ తమ దగ్గర ఉంచుకుని ఒక కాపీని ప్రాంతీయ సంయుక్త
సంచాలకులువారికి సమర్పించవలెను.


 ప్రతి శనివారం జిల్లా స్థాయి రిపోర్టు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వారికి
మెయిల్ చేయవలెను. కావున అందుకు అనుగుణంగా క్రింది స్థాయి నుంచి సమాచారమును
తెప్పించుకొనవలెను.


 ఈ క్విక్ రిపోర్ట్ ఆధారంగా తదుపరి వారంలో జిల్లా స్థాయిలో రివ్యూలు
జరుపబడతాయి మరియు సందర్శన సమయంలో ప్రతి స్థాయిలోనూ ఈ రిపోర్టులు పరిశీలించ
బడతాయి.


కావున మనబడి నాడు-నేడు లో పాల్గొంటున్న ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ
అధికారులు, నియోజకవర్గం నోడల్ ఆఫీసర్లు మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు అందరూ ఈ
విషయమును గమనించి, ప్రతి శనివారం జిల్లా స్థాయి క్విక్ రిపోర్ట్ , ప్రాంతీయ
సంయుక్త సంచాలకులు వారికి అందునట్లుగా చూడవలెను.


 ఈ క్విక్ రిపోర్ట్ మరియు అనెగ్జర్లను పూర్తి చేయుట లో గమనించవలసిన అంశములు:


ఈ ప్రొఫార్మా లాక్ చేయబడి ఉంటుంది. కేవలం అనుమతించబడిన మేరకే మీరు సమాచారమును
నింప గలరు.


ప్రతి స్థాయిలోను, ప్రతి వారం, ఈ ప్రొఫార్మా మరియు దీనితోపాటు ఇవ్వబడిన
నాలుగు  అనెగ్జర్లను తగిన తాజా సమాచారం తో నింపి, ప్రింట్ తీసుకొని, ఒక కాపీ
తమ వద్ద ఉంచుకుని, ఒక కాపీని పై స్థాయికి పంపవలెను.  


ప్రొఫార్మా ఒక్కటి మాత్రమే ప్రింట్ తీసి పంపవలెను.  ప్రొఫార్మా సాఫ్ట్ కాపీ
మరియు సమాచారము నింపబడిన నాలుగు అనెగ్జర్లు సాఫ్ట్ కాపీలు మాత్రమే పై స్థాయికి
మెయిల్ చేయవలెను.


 ప్రతి సారి లాక్ చేయబడినటువంటి ఇదే ప్రొఫార్మాను మాత్రమే పంపవలెను. లాక్
చేయబడిన ప్రొఫార్మా కాకుండా, మరి ఎటువంటి ప్రొఫార్మా అయినా సరే తిరస్కరించబడును.


జిల్లా స్థాయి నుండి తప్పనిసరిగా ప్రతి శనివారం ఒక ప్రింట్ అవుట్ స్కాన్ కాపీ
మరియు లాక్ చేయబడినటువంటి ఈ ప్రొఫార్మా ను అనెగ్జర్లతో పాటుగా మెయిల్ చేయవలెను.


ఈ క్విక్ రిపోర్ట్ మరియు అనెగ్జర్లను నింపుటకు ఫీల్డ్ స్థాయి సమాచారం సేకరించడంతో
పాటు, మనబడి నాడు నేడు వెబ్ సైట్ లో లభ్యమవుతున్నటువంటి వివరణాత్మక రిపోర్ట్స్ ను
కూడా పరిగణలోనికి తీసుకొనవలెను.


 ఈ క్విక్ రిపోర్టును ప్రతి స్థాయిలోనూ తక్షణ సమీక్షల కొరకు ఉపయోగించు
కొనవలెను.


మనబడి నాడు నేడు కార్యక్రమమునకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా, ఈ విషయంలో చూపించబడు
ఎటువంటి నిర్లక్ష్యం అయినను తీవ్రముగా పరిగణించబడునని తెలియజేయడమైనది.
Flash...   INTER RESULTS RELEASED . SEARCH YOUR RESULTS