PAN CARD – ADHAAR LINK.. కేంద్రం కీలక నిర్ణయం!

మీకు పాన్ కార్డు ఉందా? అలాగే ఆధార్ కార్డు కూడా కలిగి ఉన్నారా? అయితే మీకు
కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. పాన్, ఆధార్ లింక్ గడువును పొడిగిస్తూ
నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికీ కూడా ఈ రెండు నెంబర్లను లింక్ చేసుకొని వారికి
ప్రయోజనం కలుగనుంది.
పాన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్ల అనుసంధానానికి ఇప్పుడు తాజా గడువు 2021 మార్చి
31గా ఉంది. దీంతో ఇంకా ఆధార్, పాన్ లింక్ చేసుకొని వారు ఆందోళన చెందాల్సిన అవసరం
లేదు. కాగా పాన్ కార్డు, ఆధార్ కార్డు కలిగిన వారు కచ్చితంగా ఈ రెండింటినీ లింక్
చేసుకోవాల్సిందే. లేదంటే భారీ జరిమానా ఎదుర్కోవలసి రావొచ్చు. అంతేకాకుండా మీకు
పాన్ కార్డు కూడా పని చేయదు.
అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు కూడా తీపికబురు అందించింది.
2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్
డెడ్‌లైన్‌ను మరికొంత కాలం పొడిగించింది. జూలై 31 వరకు ఐటీఆర్ దాఖలు చేసేందుకు
గడువు ఇచ్చింది. దీంతో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలగనుంది.
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇది వరకు కూడా ఐటీఆర్ దాఖలు గడువును
పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2020 నవంబర్ 30 వరకు ఐటీఆర్
దాఖలు చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక
నోటిఫికేషన్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
అంతేకాకుండా సీబీడీటీ పన్ను చెల్లింపుదారులకు మరో శుభవార్త కూడా అందించింది.
వివిధ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి పన్ను ఆదా చేసుకోవాలని భావించే
వారికి ప్రయోజనం కలిగే నిర్ణయం తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి జూలై 31
వరకు ఇన్వెస్ట్ చేసే సదుపాయం కల్పించింది. అంటే జూలై 31 వరకు ట్యాక్స్ సేవింగ్
సాధనాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. పన్ను తగ్గింపు పొందొచ్చు.
ఇంకా కేంద్రం ప్రభుత్వం చిన్న, మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే
నిర్ణయం కూడా తీసుకుంది. సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్ పేమెంట్‌కు డెడ్‌లైన్‌ను
నవంబర్ 30 వరకు పొడిగించింది. రూ.లక్ష వరకు చెల్లింపులకు మాత్రమే ఇది
వర్తిస్తుంది. ఈ పరిమితి దాటిన చెల్లింపులకు ఎటువంటి మినహాయింపు లేదు.
Flash...   Conduct of online photography contest – for school children