SBI చెప్పింది GOOD NEWS.. రేపటి నుంచే అమల్లోకి.

భుత్వరంగ అతిపెద్ద బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు
శుభవార్త చెప్పింది.. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు
(ఎంసీఎల్ఆర్)లో కోత విధించింది. తాజాగా.. 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధిస్తూ
నిర్ణయం తీసుకుంది. 

దీంతో ఇప్పటి వరకు 7.25 శాతంగా ఉన్న ఎంసీఎల్ఆర్ రేటు ఇప్పుడు 7 శాతానికి
దిగివచ్చింది.. ఇక, సవరించిన తాజా వడ్డీ రేట్లు.. రేపటి నుంచి (ఈ నెల 10వ తేదీ)
అమలులోకి రానున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది.. ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ రేటు తగ్గించడం
ఇది వరుసగా 13వ సారి కావడం విశేషం.. 

మరోవైపు.. బేస్ రేటును కూడా తగ్గించేశారు.. ఏకంగా 75 బేసిస్ పాయింట్ల మేర కోత
విధించడంతో.. బ్యాంక్ బేస్ రేటు 7.4 శాతానికి దిగొచ్చింది. ఇది కూడా రేపటి
నుంచే అమలులోకి రానుంది. కరోనా వైరస్, లాక్‌డౌన్‌తో దిద్దుబాటు చర్యలు చేపట్టిన
ఆర్బీఐ.. ఇటీవల రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఇప్పుడు
ఎస్బీఐ ఈ వడ్డీ రేట్ల పూర్తి ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేసింది.
Flash...   G.O.645 Dr. N.Ramesh Kumar, IAS(Retd.,) - Restoring the position of State Election Commissioner